Triple murder in Mohali: డ్రగ్స్‌కు బానిసై.. రెండేళ్ల చిన్నారితో సహా అన్న, వదినలను చంపి కాలువలో విసిరేసి..
డ్రగ్స్‌కు బానిసైన 28 ఏళ్ల యువకుడు మత్తులో తానెంత ఘోరం చేస్తున్నాడో గ్రహించలేక పోయాడు. సొంత అన్న కుంటుంబాన్ని దారుణంగా హతమార్చాడు. రెండేళ్ల పిల్లాడితో సహా అన్న, వదినలను చంపాడు. అనంతరం మృతదేహాలను కాలువలో పడేశాడు. ఈ దారుణ ఘటన మోహాలీ జిల్లాలోని ఖరార్ గ్లోబల్ సిటీలో మంగళవారం (అక్టోబర్ 10) జరరుగగా గురువారం రాత్రి (అక్టోబర్ 12) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు..

చండీగఢ్, అక్టోబర్ 13: డ్రగ్స్‌కు బానిసైన 28 ఏళ్ల యువకుడు మత్తులో తానెంత ఘోరం చేస్తున్నాడో గ్రహించలేక పోయాడు. సొంత అన్న కుంటుంబాన్ని దారుణంగా హతమార్చాడు. రెండేళ్ల పిల్లాడితో సహా అన్న, వదినలను చంపాడు. అనంతరం మృతదేహాలను కాలువలో పడేశాడు. ఈ దారుణ ఘటన మోహాలీ జిల్లాలోని ఖరార్ గ్లోబల్ సిటీలో మంగళవారం (అక్టోబర్ 10) జరుగగా గురువారం రాత్రి (అక్టోబర్ 12) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పంజాబ్‌లోని బార్నాలాలోని ఖరార్‌లో గ్లోబల్ సిటీలో సత్బీర్ సింగ్, అతని భార్య అమన్‌దీప్ కౌర్ అనే యువతితో కొంత కాలం క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. సత్బీర్ వృతి రిత్యా వెబ్ డిజైనింగ్ చేస్తుండేవాడు. అతని భార్య, కొడుకు ఇంట్లోనే ఉండేవారు. అయితే సత్బీర్ తన వ్యాపారం బాగా డెవలప్ అవ్వడంతో ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నాడు. దానిని చూసి అతని తమ్ముడు లఖ్బీర్ (23) ఓర్చుకోలేకపోయాడు. దీంతో అన్నపై ద్వేషం, ఈర్ష్య పెంచుకున్న లఖ్బీర్ అన్నను హతమార్చాలని అనుకున్నాడు. డ్రగ్స్ బానిపైన లఖ్బీర్ అనేక చెడు వ్యసనాలతో యువకులతో తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి లఖ్బీర్ తన అన్న సత్బీర్ ఇంటికి వెళ్లాడు.
డ్రగ్స్ సేవించి వచ్చిన లఖ్బీర్ తన అన్నతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో అన్నపై దాడి చేశాడు. వెంటనే వదిన అమన్‌దీప్ కౌర్ అడ్డు రాగా అతను కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం సత్బీర్‌ను ఆమెను కాపాడేందుకు ప్రయత్నింగా నిందితుడు సత్బీర్‌పై కూడా దాడి చేసి, పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు. తర్వాత దంపతుల రెండేళ్ల కొడుకును కూడా కత్తితో పొడిచి చంపాడ. ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సత్బీర్, అమన్‌దీప్, వారి కొడుకు మృతదేహాలను మొరిండా పట్టణం సమీపంలోని రోపర్‌లోని సిర్హింద్ కాలువలోకి విసిరేశాడు. ట్రిపుల్ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటపడింది. మృతుడి సోదరుడు లఖ్బీర్ ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. కాగా మోరిండా సమీపంలోని కజౌలి గ్రామంలోని కాలువలో అమన్‌దీప్ కౌర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్బీర్, అతని కొడుకు మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోదరుడిపై ద్వేషమే కారణంగానే అన్న కుటుంబాన్ని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. డ్రగ్స్ బానిసైన లఖ్బీర్ అన్నపై పగను పెంచుకుని ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉందని, తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీసధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.