Tomatoes: ఆల్ టైమ్ రికార్డుకు చేరిపోయిన టమాటా ధరలు.. చండీగఢ్‌లో ఏకంగా రూ.300
టమాటాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర పలు ప్రాంతాల్లో 200 నుంచి 250 రూపాయలు ఉంది. అయితే రాబోయే రోజుల్లో వీటి ధర దేశవ్యాప్తంగా రూ.300 లకు చేరే అవకాశం ఉందని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ సీఈఓ సంజయ్ గుప్తా అంచనా వేశారు.

టమాటాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర పలు ప్రాంతాల్లో 200 నుంచి 250 రూపాయలు ఉంది. అయితే రాబోయే రోజుల్లో వీటి ధర దేశవ్యాప్తంగా రూ.300 లకు చేరే అవకాశం ఉందని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ సీఈఓ సంజయ్ గుప్తా అంచనా వేశారు. కానీ ఇప్పటికే రిటైల్ దుకాణాల్లో మాత్రం ధరలు మండిపోతున్నాయి. చండీగఢ్‌లో కిలో టమాటా ధరలు రూ.300 దాటాయి. అక్కడ పలు మార్కెట్లో ఏకంగా ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. అయితే కొద్దిగా నాణ్యత ఉన్న టామాటాలు మాత్రం సగటున 100 నుంచి 150 రూపాయలకు అమ్ముడు పోతున్నాయి.
అయితే ఈ ధరలను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లీటర్ పెట్రోల్ కంటే కిలో టమాటాలకే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. భారీ వర్షాలు పడటం వల్లే దిగుబడి దగ్గడంతో టమాటా ధరలు చాలా రాష్ట్రాల్లో పెరిగాయని కురగాయలు అమ్మేవాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నిల్వ ఉంచుకునే వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా టమాటా ధరలు పెరగడం కొంతకాలం వరకే ఉంటుందని… ఆ తర్వాత మళ్లీ ధరలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..




