మహారాష్ట్రను వణికిస్తున్న GBS.. తాజాగా మరో 3 కేసులు నమోదు..
ఈ గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

మహారాష్ట్ర ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కేసులు కలవరపెడుతున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం అక్కడ మరో మూడు GBS కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 ఏళ్ల వృద్ధురాలికి GBS వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా నీటి నమూనాలను పరీక్షించడంతో శనివారం మరో రెండు నీటి వనరులు కలుషితమైనట్లు తేలింది.
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అక్కడ వందల మందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..