‘ఇది వేవ్ కాదు, సునామీ’, దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్య
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఆందోళన కలిగిస్తున్న ఆక్సిజన్ కొరత పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది వేవ్ కాదని, సునామీ అని పేర్కొంది. మనం దీన్ని వేవ్ అంటున్నాం, కానీ నిజానికి ఇది సునామీ అని వ్యాఖ్యానించింది.
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఆందోళన కలిగిస్తున్న ఆక్సిజన్ కొరత పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది వేవ్ కాదని, సునామీ అని పేర్కొంది. మనం దీన్ని వేవ్ అంటున్నాం, కానీ నిజానికి ఇది సునామీ అని వ్యాఖ్యానించింది. మే నెలలో మరో సెకండ్ వేవ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయని, దీన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి సంసిద్ధంగా ఉన్నారా అని న్యాయమూర్తులు అన్నారు. కోవిద్ మరణాల సంఖ్యను తగ్గించే బాధ్యత మీదే అని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారు పేర్కొన్నారు. ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తామని కేంద్రం చెప్పిందని, అయితే ఇది ఎప్పుడు జరుగుతుందని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ఈ నెల 21 న హామీ ఇచ్చిన విషయాన్నీ న్యాయమూర్తులు గుర్తు చేశారు.దీనిపై..దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉందని, రోగుల సంఖ్య పెరుగుతుండడం ఇందుకు కారణమని కేంద్రం తరఫున హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు.
ఢిల్లీతో బాటు రాష్ట్రాలు, కేంద్రం కూడా కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. సింగపూర్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులు వస్తున్నాయని, ఇండియాలో ఆక్సిజన్ పంపిణీకి వీటిని వినియోగిస్తామని ఆయన తెలిపారు. కాగా-ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తుండాలని సప్లయర్లను, రీ-ఫిల్లర్లను కోర్టు ఆదేశించింది. మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సూచించింది. రవాణా అవుతున్న ఆక్సిజన్ ను ఆపడానికి ఎవరు ప్రయత్నించినా వారిని ఉరి తీస్తామని అంతకు ముందు హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఎవరినీ వదలబోమని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఏకంగా ఢిల్లీ నగరంలోనే ఓ బిజినెస్ మన్ తన ఇంట్లో 48 ఆక్సిజన్ సిలిండర్లను దాచి…. చిన్నవాటిని 12,500 రూపాయలకు అమ్ముకుంటున్న వైనం పై ఎవరూ నోరెత్తలేదు. పోలీసులు ఈ వ్యక్తి ఇంటిపై దాడి చేసి ఈ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఏపీలో కరోనా ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న సమయంలో చికెన్ ధరలు డౌన్.. రీజన్ ఇదే…