AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custom: ఆ గ్రామంలో భార్యలను అద్దెకు ఇస్తారు.. అది ఎక్కడంటే..

మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో కులాలు ఉన్నాయి. ఎన్నో తెగలున్నాయి. అలాగే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆచారాలు చూస్తే భయం అనిస్తుంది. మరికొన్ని ఆచారాలు చూస్తే ఇంత ఘోరమా అనిపిస్తుంది...

Custom: ఆ గ్రామంలో భార్యలను అద్దెకు ఇస్తారు.. అది ఎక్కడంటే..
Wife Rent
Srinivas Chekkilla
|

Updated on: Nov 11, 2021 | 9:14 PM

Share

మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో కులాలు ఉన్నాయి. ఎన్నో తెగలున్నాయి. అలాగే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆచారాలు చూస్తే భయం అనిస్తుంది. మరికొన్ని ఆచారాలు చూస్తే ఇంత ఘోరమా అనిపిస్తుంది. ఇలాంటి దారుణమైన ఆచారం ఓ గ్రామంలో ఉంది. అదేమిటంటే ఒక వ్యక్తి భార్యను మరో వ్యక్తికి అద్దెకు ఇవ్వడం.. అవును మీరు చదువుతుంది నిజమే.. వస్తువునో.. ఇళ్లనో అద్దెకు ఇస్తారు కానీ భార్యలను అద్దెకు ఇవ్వడమనేది వింతగా అనిపిస్తుంది. ఈ వింత ఆచారం మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో ఉంది. ఇక్కడ తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. సంవత్సరాలు కూడా అద్దెకు భార్యలను తీసుకెళ్లొచ్చు. ఈ ఆచారాన్ని ధదీచ ప్రాత అని పిలుస్తారు.

పెళ్లి కానీ ధనవంతులు.. ఇతరుల భార్యను తీసుకెళ్లి భార్యగా ఉంచుకోవచ్చు. ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు వారిని భార్యగా ఉంచుకోవచ్చు. అయితే వారి భర్తలకు రూ.10 లేదా రూ.100ల స్టాంపులపై సంతకాలు పెట్టి, రేటు మాట్లాడుకొని అద్దెకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. శివపురి ప్రాంతంలోని గ్వాలియర్ రాజపుత్రులు ఎక్కువగా జీవనం సాగిస్తారు. ఈ రాజపుత్రులలో ఎక్కువమంది డబ్బున్న వారు కావడం గమనార్హం. వీరే భార్యలను అద్దెకు తీసుకెళ్తారు.

ఒక్కో మహిళ రేటు పదివేలు నుంచి లక్ష వరకు ఉంటుంది. అయితే ఇక్కడ అద్దెకు వెళ్లిన మహిళ సొంత భార్యలానే ప్రవర్తించాలి. మానసికంగా, శారీరకంగా ఆమె అతడి భార్యే.. ఆ సమయంలో ఆమెకు పిల్లలు పుట్టినా కూడా అది వారి బాధ్యతే.. వయస్సు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాల్లో భారీ మొత్తం చెల్లిస్తారని పేర్కొంటున్నారు. ఈ ఆచారాన్ని పోలీసులు మాన్పించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలుస్తుంది. ఈ ఆచారం మధ్యప్రదేశ్‌లోనే కాకుండా గుజరాత్‌లో కూడా ఉంది.

Read Also.. Punjab Assembly: పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌-అకాలీదళ్‌ మధ్య తోపులాట.. 14మంది ఎమ్మెల్యేలపై వేటు!