Gujarat Restricts: గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ వేసుకోకుంటే అనుమతి నిరాకరణ!
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా తీసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Gujarat Restricts for Vaccine: కరోనా నియంత్రణలో ప్రపంచం యుద్ధమే చేస్తోంది. వైరస్ తీవ్రతను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న సూచన మేరకు టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా తీసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీకా వేసుకోవడానికి అర్హత ఉన్నా.. తీసుకోని 18 ఏళ్లు పైబడిన వారికి నిర్దేశిత ప్రాంతాల్లో అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొంది.
పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రజా రవాణాలో అనుమతి నిరాకరిస్తున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ స్పష్టంచేసింది. అలాగే, లైబ్రరీ, స్విమింగ్‌పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి చోట్లా వ్యాక్సిన్ వేసుకోని వారికి అనుమతించబోమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆయా చోట్ల ప్రవేశానికి ముందు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాలని పేర్కొంది. మరోవైపు ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.28 కోట్ల డోసులు పంపిణీ చేశారు. సుమారు నాలుగు నెలల తర్వాత బుధవారం రోజు కొవిడ్ కేసుల సంఖ్య 40 దాటింది.
మరోవైపు అహ్మదాబాద్ నగరంలో ఇప్పటివరకు 9 లక్షల 80 వేల మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అందుకే ఇప్పుడు మరింత కష్టపడి పనిచేయాలని ఏఎంసీ నిర్ణయించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి, పౌరులు తక్షణ ప్రభావంతో రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో AMC ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ పండుగల సమయంలో ప్రజల సంఖ్య పెరగడం, కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించడం వల్ల అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఫలితంగా, AMC ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇప్పుడు మేల్కొంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా కరోనా పరీక్షను తిరిగి ప్రారంభించారు. Read Also… CM KCR: ఉద్యోగుల సర్దుబాటు తర్వాత ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు.. టీజీవో నేతలకు సీఎం కేసీఆర్ హామీ