Punjab Assembly: పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌-అకాలీదళ్‌ మధ్య తోపులాట.. 14మంది ఎమ్మెల్యేలపై వేటు!

పంజాబ్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌, విపక్ష అకాలీదళ్‌ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్‌ సరిహద్దులో బీఎస్ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది.

Punjab Assembly: పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌-అకాలీదళ్‌ మధ్య తోపులాట.. 14మంది ఎమ్మెల్యేలపై వేటు!
Ruckus In Punjab Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2021 | 8:26 PM

Ruckus in Punjab assembly: పంజాబ్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌, విపక్ష అకాలీదళ్‌ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్‌ సరిహద్దులో బీఎస్ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ సందర్భంగా వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఓ దశలో పీసీసీ చీఫ్‌ సిద్దూ , అకాలీదళ్‌ ఎమ్మెల్యే బిక్రంసింగ్‌ మంజీత కొట్టుకున్నంత పనిచేశారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వందలాదిమంది మార్షల్స్‌ను అసెంబ్లీ మొహరించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు దూసుకెళ్లారు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలు. మీరు దేశద్రోహులు , డ్రగ్స్‌ వ్యాపారం చేస్తారంటు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చన్నీ. ఇదే సమయంలో అక్కడికి దూసుకొచ్చిన సిద్దూ.. ఎమ్మెల్యే బిక్రంసింగ్‌ మంజీతను దొంగా అంటూ దూషించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరస్పర దూషణలు కాస్తా పార్టీల మధ్య చిచ్చును రాజేశాయి.సిద్దూను దూషించేముందు నీ చరిత్ర తెలుసుకో అంటూ బిక్రంసింగ్‌పై విరుచుకుపడ్డారు సీఎం చన్నీ. దీనికి నిరసనగా స్పీకర్‌ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. స్పీకర్‌ 14 మంది అకాలీదళ్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు.

అసెంబ్లీ లాబీల్లో కూడా గొడవ కంటిన్యూ అయ్యింది. అయితే మార్షల్స్‌ అకాలీదళ్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా గుడ్డిగా వ్యతిరేకించడం అకాలీదళ్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు సిద్దూ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపన్నారు. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ తనపై సవతితల్లి ప్రేమ చూపించిందని , అందుకే కౌసల్య లాంటి కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలతో వాగ్వాదం సందర్భంగా సిద్దూ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ మూడు వ్యవసాయ చట్టాలతో పాటు , రాష్ట్ర సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించింది.

Read Also…  GHMC: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్.. దోమల విముక్తి డ్రోన్లతో యుద్ధం.. జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం