PM Modi: కేరళలో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం.. ఆసక్తికర పరిణామాలు..

|

Apr 25, 2023 | 11:28 AM

PM Modi in Kerala: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. కేరళ కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. మరోవైపు దేశవ్యాప్తంగా సౌకర్యవంతమైన రైల్వే సేవలు..

PM Modi: కేరళలో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం.. ఆసక్తికర పరిణామాలు..
PM Modi Kerala Visit
Follow us on

PM Modi in Kerala: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. కేరళ గవర్నర్ అరిఫ్ మొహ్మద్ ఖాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. మరోవైపు దేశవ్యాప్తంగా సౌకర్యవంతమైన రైల్వే సేవలు, రైల్వే ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పూనకున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు నగరాలలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. తాజాగా కేరళలో కూడా తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు. కేరళలోని కాసర్‌గోడ్-తిరువనంతపురం మధ్య నడిచే ఈ వందే భారత్ రైలు మొత్తం  11 జిల్లాల మీదుగా ప్రయాణించనుంది. ఇక ఇది దేశంలో 16వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కావడం మరో విశేషం.

‘కాసరగోడ్ – తిరువనంతపురం సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20633/20634)’ కాసర్‌గోడ్, తిరువనంతపురం మధ్య నడుస్తుంది. ఇక ఈ ట్రైన్ తిరువనంతపురం నుంచి ప్రారంభమై కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిసూర్, షోరనూర్, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్‌ స్టేషన్లలో ఆగుతుంది. అలాగే రివర్స్‌లో కూడా కాసరగోడ్ నుంచి తిరువనంతపురం చేరుకునే క్రమంలో ఆయా స్టేషన్లలో ఆగుతుంది.

కాగా, కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ‘కాసరగోడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ కాసరగోడ్ నుంచి తిరువనంతపురం 8:05 నిముషాలల్లోనే చేరుతుంది. అంతకముందు ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే 2 గంటల 40 నిముషాల కంటే వేగంగా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..