
బిహార్ లో దొంగల ముఠా మైబైల్ టవర్లను ఎత్తుకెళ్లిన ఎత్తుకెళ్లిన ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుంకుంది.కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే మొబైల్ టవర్ విడిభాగాలను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ముజఫర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్ లో మనీషా కుమారీ అనే మహిళ ఉంటోంది. అయితే గతంలో ఆ మహిళ ఇంటి సమీపంలో మొబైల్ టవర్ ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత పలు సాంకేతిక కారణాలకతో ఆ టవర్ పనిచేయడం లేదు.
దీంతో కొంతమంది వ్యక్తులు ఆ టవర్ వద్దకు వచ్చారు. తామంతా మొబైల్ టవర్ సంస్థకు చెందిన ఉద్యోగులమని ..ఇప్పుడు ఈ టవర్‌తో పనిలేదని. అందుకే వీటి భాగాలను తొలగిస్తున్నామని అక్కడి స్థానికులకు చెప్పారు. సుమారు 4 గంటల పాటు కష్టపడి టవర్ మొత్తాన్ని భాగాలుగా విడదీసి తీసుకెళ్లారు. రెండ్రోజుల క్రితం దానిని బాగుచేసేందుకని కంపెనీ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. అయితే ఆ టవర్ లేకపోవడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కంపెనీ ప్రతినిధి షానవాజ్ అన్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్థానికులను విచారించారు. దీంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. ప్రస్తుతం నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి