Bank Robbery: చెన్నైలో రెచ్చిపోయిన దోపిడి దొంగలు.. బ్యాంకు మొత్తం కొల్లగొట్టారు..!

Bank Robbery: చెన్నైలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం సెలవు దినాన్ని ఛాన్స్‌గా భావించిన దొంగలు.. బ్యాంకులో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నై శివారులోని

Bank Robbery: చెన్నైలో రెచ్చిపోయిన దోపిడి దొంగలు.. బ్యాంకు మొత్తం కొల్లగొట్టారు..!
Robbery
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2021 | 8:57 AM

Bank Robbery: చెన్నైలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం సెలవు దినాన్ని ఛాన్స్‌గా భావించిన దొంగలు.. బ్యాంకులో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నై శివారులోని వ్యాసరపడిలో చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వ్యాసరపడిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో దొంగలు పడ్డారు. ఆదివారం కావడంతో తాళాలు వేసి ఉన్న బ్యాంకులో చొరబడ్డారు. బ్యాంకు తాళాలు పగలకొట్టిన దొంగలు.. లాకర్ రూమ్‌లో ఉన్న బంగారం, నగదు దోపిడీ చేశారు. కాగా, ఆదివారం సెలవు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. చోరీకి గురైన బ్యాంకును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, సీసీ విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చోరీకి పాల్పడింది నేపాల్ గ్యాంగ్‌గా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..