డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ మార్పు.. కానీ..

ఆధార్ కార్డులో మార్పులు చేయాలంటే.. దాన్ని మార్చడానికి ఏదైనా డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌లోని కొన్ని మార్పులకు మాత్రం ప్రూఫ్స్‌తో సంబంధం లేదని భారత విశిష్ట ప్రాధికార సంస్థ(ఉడాయ్) స్పష్టం చేసింది. సాధారణంగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికెట్ లాంటివి తీసుకెళ్తాం. అయితే ఆధార్‌లోని ఫింగర్‌ప్రింట్‌, జెండర్‌, మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ, ఐరిస్‌ స్కాన్‌, ఫొటో లాంటి మార్పులకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వనక్కర్లేదని ఉడాయ్ […]

డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ మార్పు.. కానీ..
Follow us

|

Updated on: Sep 13, 2019 | 6:42 PM

ఆధార్ కార్డులో మార్పులు చేయాలంటే.. దాన్ని మార్చడానికి ఏదైనా డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌లోని కొన్ని మార్పులకు మాత్రం ప్రూఫ్స్‌తో సంబంధం లేదని భారత విశిష్ట ప్రాధికార సంస్థ(ఉడాయ్) స్పష్టం చేసింది. సాధారణంగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికెట్ లాంటివి తీసుకెళ్తాం. అయితే ఆధార్‌లోని ఫింగర్‌ప్రింట్‌, జెండర్‌, మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ, ఐరిస్‌ స్కాన్‌, ఫొటో లాంటి మార్పులకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వనక్కర్లేదని ఉడాయ్ తెలిపింది.

వీటి మార్పు కోసం కేవలం మీ ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని ఆధార్ కేంద్రం వద్దకు వెళ్తే చాలని ఉడాయ్ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే పేరు, పుట్టినతేదీ, చిరునామా మార్చుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అవసరమని ఉడాయ్ మరోసారి స్పష్టం చేసింది. పాస్‌పోర్టు, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం ఇలా ఏదో ఒక డాక్యుమెంట్‌ ఇవ్వాలని పేర్కొంది.