కోల్‌కతాలో నిరుద్యోగుల ర్యాలీ.. హింసాత్మకంగా మారిన ఆందోళన

కోల్‌కతాలో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శుక్రవారం ఉదయం లెఫ్ట్ పార్టీల పిలుపుతో వేలాది మంది నిరుద్యోగులు కోల్‌కతా నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐ తో పాటు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సరిగ్గా హౌరా సమీపంలో ఉన్నరాష్ట్ర సచివాలయం వద్దకు చేరుకునే సరికి వీరు చేస్తున్న ర్యాలీ హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, […]

కోల్‌కతాలో నిరుద్యోగుల ర్యాలీ..  హింసాత్మకంగా మారిన ఆందోళన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 13, 2019 | 5:51 PM

కోల్‌కతాలో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శుక్రవారం ఉదయం లెఫ్ట్ పార్టీల పిలుపుతో వేలాది మంది నిరుద్యోగులు కోల్‌కతా నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐ తో పాటు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సరిగ్గా హౌరా సమీపంలో ఉన్నరాష్ట్ర సచివాలయం వద్దకు చేరుకునే సరికి వీరు చేస్తున్న ర్యాలీ హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్ధి సంఘాలు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు.

రాష్ట్రంలో దీదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూతమకు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగులు తమ ప్రధాన డిమాండ్‌తో రోడ్డెక్కారు. వీరు హౌరా ప్రాంతానికి చేరుకుంటున్న క్రమంలో అక్కడ పోలీసుల్ని దాటకుని వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ర్యాలీ హింసాత్మకంగా మారింది. దీంతో అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు నిరసన కారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. మరోవైపు వారిని చెల్లాచెదురు చేసేందుకు బాష్ఫవాయు గోళాలు కూడా ప్రయోగించారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌లో అనేమంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు.