లొంగిపోతానన్నా ఒప్పుకోని కోర్టు.. జైల్లోనే చిదంబరం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అక్రమ నగదు చలామణీ కేసులో ఈడీకి లొంగిపోతానంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో గత నెలలో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో ఈడీకి లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలంటూ […]

లొంగిపోతానన్నా ఒప్పుకోని కోర్టు.. జైల్లోనే చిదంబరం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:27 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అక్రమ నగదు చలామణీ కేసులో ఈడీకి లొంగిపోతానంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు.

అయితే ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో గత నెలలో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో ఈడీకి లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలంటూ చిదంబరం గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అక్రమ నగదు చలామణీ కేసులో ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పుడే చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపింది. తగిన సమయంలో చిదంబరాన్ని అదుపులోకి తీసుకుంటామని వారు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్ కోసం కూడా చిదంబరం గురవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 23న విచారణ జరగనుంది. కాగా ఈ నెల 19వరకు ఆయన తీహార్ జైల్లోనే ఉండనున్న విషయం తెలిసిందే.