గొప్ప గురువు ప్రముఖ్ స్వామి మహారాజ్.. అబ్దుల్ కలాం ఆనాడే అన్నారు.. వివరాలు ఇవిగో
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్‌ను గుర్తు చేసుకున్నారు అక్షరధామ్ సిబ్బంది. ఆయన రాసిన 'ట్రాన్స్‌సెండెన్స్: మై స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ' అనే పుస్తకంలో పొందుపరిచిన మాటలను తాము ఇప్పటికీ గౌరవిస్తున్నామని అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్‌ను గుర్తు చేసుకున్నారు అక్షరధామ్ సిబ్బంది. ఆయన రాసిన ‘ట్రాన్స్‌సెండెన్స్: మై స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ’ అనే పుస్తకంలో పొందుపరిచిన మాటలను తాము ఇప్పటికీ గౌరవిస్తున్నామని అన్నారు. అబ్దుల్ కలాం ఆ పుస్తకంలో ప్రముఖ్ స్వామి మహారాజ్‌ను గురించి ప్రస్తావిస్తూ.. ‘గొప్ప గురువు – అంతిమ గురువు’ అని అభివర్ణించారు.
గురు-శిష్య సంప్రదాయాన్ని భారతదేశంలో ఓ గొప్ప వేడుకలా జరుపుకుంటారు. ఇక్కడ జ్ఞానం, మార్గదర్శకత్వం, జీవిత పాఠాలు తరతరాలకు స్పూర్తినిస్తాయి. ప్రముఖ్ స్వామి మహారాజ్‌ను.. తన విలువలు, మాటల ద్వారా ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అతను ఒక ఆధ్యాత్మిక గురువు, మార్గదర్శి మాత్రమే కాదు.. డాక్టర్ కలాం, లెక్కలేనన్ని ఇతరులకు ప్రేరణ కల్పించిన మహోన్నత వ్యక్తీ కూడా.
View this post on Instagram




