దానకర్ణుడికి తమ్ముడిలా.. స్కూల్ కోసం ఏకంగా ఇంటినే రాసిచ్చాడు.. ఆ తర్వాత.!
జూలై నెలలో ఝలావర్‌లోని పిప్లోడి గ్రామంలో పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయం ఏడుగురు అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయి.. ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ప్రమాదం తర్వాత, మిగిలిన పిల్లల చదువులను ఎలా, ఎక్కడ ప్రారంభించాలనేది అతిపెద్ద సమస్య తలెత్తింది. అప్పుడు ఆ గ్రామానికి చెందిన మోర్ సింగ్ అనే రైతు అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు.

జూలై నెలలో రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలో పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయం ఏడుగురు అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయి.. ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ప్రమాదం తర్వాత, మిగిలిన పిల్లల చదువులను ఎలా, ఎక్కడ ప్రారంభించాలనేది అతిపెద్ద సమస్య తలెత్తింది. అప్పుడు ఆ గ్రామానికి చెందిన మోర్ సింగ్ అనే రైతు అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. పాఠశాల కోసం తన ఇంటిని ఇచ్చి, పొలంలో టార్పాలిన్ గుడిసెలో తన కుటుంబంతో నివస్తున్నారు.
జూలైలో పీప్లోడిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒక ప్రమాదానికి గురైంది. ఒక తరగతి గది కూలిపోయి ఏడుగురు పిల్లలు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఇది ఆ గ్రామానికి పెద్ద షాక్. ప్రాణాలతో బయటపడిన పిల్లల చదువులు ఆగిపోయే దశలో ఉన్నాయి. ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ స్థలం కోసం వెతుకుతున్నారు. కానీ ఎవరూ తమ ఇల్లు, భవనాన్ని ఇవ్వడానికి ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితిలో, ఉపాధ్యాయుడు మోర్ సింగ్‌ను కలిశారు. అతను ఏమాత్రం ఆలోచించకుండా తన ఇల్లును పాఠశాలకు ఇచ్చేందుకు అంగీకరించాడు. “ఆ సమయంలో దేవుని ఆశీర్వాదం లభించిందని భావించాను. మా ఇంట్లో పిల్లలు చదువుకుంటే, దీనికంటే గొప్ప సేవ ఏముంటుంది. వర్షం అయినా, ఎండ అయినా, నేను నా కుటుంబంతో కలిసి పొలంలోనే ఉంటాను, కానీ పిల్లల చదువులు ఆగకూడదు.” అని మోర్ సింగ్ అన్నాడు,
మోర్ సింగ్ కుటుంబంలో ఎనిమిది మంది ఉన్నారు. వారందరూ ఇప్పుడు పొలంలో నిర్మించిన తాత్కాలిక గుడిసెలో నివసిస్తున్నారు. ప్లాస్టిక్, టార్పాలిన్‌తో తయారు చేసిన ఈ గుడిసెలో రెండు మంచాలు, ఒక స్టవ్, కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వస్తువులను బంధువుల ఇంటిలో దాచారు. వర్షాకాలంలో పైకప్పు లీక్ అవుతుంది, కీటకాలు, పాముల నుండి తమను తాము రక్షించుకోవడానికి రాత్రిపూట గడ్డిని కాల్చేస్తున్నట్లు మోర్ సింగ్ తెలిపారు. కానీ కుటుంబ సభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. గ్రామంలోని పిల్లలు ఇప్పుడు తమ ఇంట్లో చదువుకుంటున్నందుకు గర్వంగా ఉందని మోర్ సింగ్ కుటుంబసభ్యులు తెలిపారు.
మోర్ సింగ్ చాలా కష్టపడి తన ఇంటిని నిర్మించుకున్నాడు. 2011లో, అతను రోజువారీ కూలీగా పనిచేస్తూ.. రూ. 4 లక్షలు ఖర్చు చేసి రెండు గదుల ఇల్లు నిర్మించుకున్నాడు. కానీ నేడు అదే ఇల్లు పాఠశాల తరగతులకు తెరిచి ఉంది. ఇవి కష్ట సమయాలు, కానీ అవి శాశ్వతంగా ఉండవని అతను చెబుతున్నాడు. కొత్త పాఠశాల భవనం నిర్మించిన వెంటనే మేము మా ఇంటికి తిరిగి వస్తామని మోర్ సింగ్ తెలిపారు.
ఝలావర్ కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ మోర్ సింగ్ త్యాగాన్ని ప్రశంసించి అతనికి ‘భామాషా’ అనే బిరుదును ఇచ్చారు. మోర్ సింగ్ సహాయం చేయకపోతే, పిల్లలను 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపాల్సి వచ్చేదని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠశాల భవనం కోసం 10 బిఘాల భూమిని కేటాయించింది. రూ.1.8 కోట్లు కూడా మంజూరు చేసింది. మోర్ సింగ్‌కు పరిహారంగా రూ.2 లక్షలు కూడా ఇచ్చారు. దీంతో కొత్త పాఠశాల భవనం పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నుండి అక్కడ తరగతులు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత, రాజస్థాన్ ప్రభుత్వం కూడా పీప్లోడిని ‘మోడల్ విలేజ్’గా మారుస్తామని ప్రకటించింది.
ప్రమాదం తర్వాత, గ్రామంలో చాలా మంది తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి భయపడ్డారు. కానీ మోర్ సింగ్ తన ఇంటిని పాఠశాల కోసం ఇచ్చినప్పుడు, గ్రామస్తులు నమ్మకం కుదిరింది. అంతే కాదు, ప్రమాదం తర్వాత, 10 మంది కొత్త పిల్లలు కూడా చేరారు. ఇప్పుడు మొత్తం 75 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది పిల్లలు ఇప్పటికీ ఇంట్లో చికిత్స పొందుతున్నారని పాఠశాల ఉపాధ్యాయుడు మహేష్ మీనా తెలిపారు. వారు చదువుకు దూరమవకుండా చూసుకోవడానికి అదనంగా ఇద్దరు ఉపాధ్యాయులను ఇంటికి పంపించినట్లు తెలిపారు.
నేడు పీప్లోడి గ్రామంలోని ప్రతి ఒక్కరూ మోర్ సింగ్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. చదువురాకపోయినా, అతను విద్య పట్ల, నిజమైన విలువను అర్థం చేసుకున్నాడు. తన ఇంటిని పిల్లలకు ఇచ్చాడు. అతని దాతృత్వం మొత్తం సమాజానికి మానవత్వం గొప్ప బలం అనే సందేశాన్ని ఇచ్చింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




