Supreme Court: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢాచర్యం కేసులో కీలక పరిణామం.. వారికి ముందస్తు బెయిల్ రద్దు..

|

Dec 02, 2022 | 3:51 PM

Supreme Court: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢాచర్యంలో ఇరికించారని ఆరోపించిన కేసులో నలుగురు మాజీ పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ నిలిపివేసింది.

Supreme Court: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢాచర్యం కేసులో కీలక పరిణామం.. వారికి ముందస్తు బెయిల్ రద్దు..
Supreme Court And Nambi Narayanan
Follow us on

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢాచర్యంలో ఇరికించారని ఆరోపించిన కేసులో నలుగురు మాజీ పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ నిలిపివేసింది. కేరళ హైకోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. బెయిల్ పిటిషన్‌లను కేరళ హైకోర్టుకు తిరిగి పంపిన ధర్మాసనం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నలుగురు అధికారులకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై CBI సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు ఈ విషయాన్ని నిర్ణయించే వరకు ఐదు వారాల పాటు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగిందని వివరాల్లోకి వెళ్తే.. 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్‌ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది.

అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్‌ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్‌ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారించారు. ఈ కేసులో ఇప్పుడు విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..