Weather Alert: హమ్మయ్య ఊపిరిపీల్చుకోండి.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..
దంచికొడుతోన్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వడగాల్పులతో ఇబ్బంది పడుతోన్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రానున్న వారం రోజులపాటు దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు తెలిపింది. తూర్పు-మధ్య భారతం, ఈశాన్య భారతం, దక్షిణాదిలోని ప్రాంతాల్లో వడగాడ్పుల పరిస్థితులు ఉండబోవని..

దంచికొడుతోన్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వడగాల్పులతో ఇబ్బంది పడుతోన్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రానున్న వారం రోజులపాటు దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు తెలిపింది. తూర్పు-మధ్య భారతం, ఈశాన్య భారతం, దక్షిణాదిలోని ప్రాంతాల్లో వడగాడ్పుల పరిస్థితులు ఉండబోవని తెలిపింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక రానున్న మూడు రోజుల్లో తూర్పు భారతం, పశ్చిమ భారతంలోని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ ఉండవని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వచ్చే నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరిలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. కోస్తా ఆంధ్ర, తెలంగాణలలో సోమవారం అక్కడక్కడ వడగళ్లు పడవచ్చని తెలిపారు.
ఇదిలా ఉంటే దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.




మరిన్ని వాతావరణ వార్తల కోసం క్లిక్ చేయండి..
