AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపేశాడు.. గుడికి వెళ్దామని నమ్మించి దారుణం..

కడ దాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా భార్యనే చంపేశాడు. ఆమె పేరు మీద ముందుగానే బీమా ప్రీమియం చేసి, డబ్బు దక్కించుకోవాలనే...

Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపేశాడు.. గుడికి వెళ్దామని నమ్మించి దారుణం..
Police Arrest Person
Ganesh Mudavath
|

Updated on: Dec 01, 2022 | 11:11 AM

Share

కడ దాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా భార్యనే చంపేశాడు. ఆమె పేరు మీద ముందుగానే బీమా ప్రీమియం చేసి, డబ్బు దక్కించుకోవాలనే దుర్బుద్ధితో పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేశాడు. రౌడీ షీటర్ తో చేతులు కలిపి దురాగతానికి ఒడిగట్టాడు. తన నుంచి దూరంగా ఉన్న భార్యకు మాయమాటలు చెప్పి గుడికి రావాలని కోరాడు. ఓ రోజు ఉదయం ఆమె తన సోదరుడితో కలిసి ఆలయానికి వెళ్తుండగా పక్కా ప్లాన్ ప్రకారం కారుతో బైక్ ఢీ కొట్టించాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా సంచలన విషయాలు తెలిశాయి. జైపూర్‌కు చెందిన షాలూ, మహేశ్‌ చంద్‌ దంపతులు. వీరికి ఓ కూతురు సంతానం. వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో షాలూ కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో తాను ఓ జ్యోతిష్యుడిని కలిశానని, ఇద్దరం కలిసి జీవించాలంటే 11 వారాలపాటు తెల్లవారుజామున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాలని నమ్మించాడు. ఈ విషయం ఎవరకీ చెప్పవద్దని, చెపితే ఫళితాలు సరిగ్గా రావని చెప్పాడు. పూజలు అయిపోయిన తర్వాత తనతో కలిసి ఇంటికి తీసుకెళ్తానని వివరించాడు.

భర్త మహేశ్ మాటలు నమ్మిన షాలూ తన సోదరుడితో కలిసి ఉదయం 4.30 సమయంలో ఆలయానికి బయల్దేరింది. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతనిని ఆస్పత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో వారు చనిపోయారని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇన్సూరెన్స్ కోసమే హత్య చేయించాడని తెలిసి అవాక్కయ్యారు. షాలూ పేరుపై మహేశ్ కొన్ని రోజుల క్రితం ఇన్సూరెన్స్‌ చేశాడు. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్‌లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 సంవత్సరాల సమయానికి పాలసీ తీసుకున్నాడు. భార్యను చంపేస్తే డబ్బు దక్కించుకోవచ్చన్న అత్యాశతో ఆమెను హత్య చేసేందుకు రెడీ అయ్యాడు. రౌడీ షీటర్‌ ముఖేశ్‌ సింగ్‌తో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం గుడికి వెళ్తుండగా కారుతో గుద్ది చంపేశాజు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి