విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి చేర్చిన అపద్భాందవుడు.. పోలీస్ చేసిన సాయం తెలిస్తే సెల్యూట్ చేస్తారు

విద్యార్థులు బోర్టు ఎగ్జామ్ ల కోసం సన్నద్ధమవడం ఓ సవాలైతే, పరీక్షలు జరిగేటప్పుడు పరీక్ష కేంద్రానికి సమయానికి వెళ్లి హాల్ టికెట్ నంబర్లు చూసుకొని పరీక్షలు రాయడం మరో సవాలు.

విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి చేర్చిన అపద్భాందవుడు.. పోలీస్ చేసిన సాయం తెలిస్తే సెల్యూట్ చేస్తారు
Student
Follow us

|

Updated on: Mar 16, 2023 | 4:58 PM

విద్యార్థులు బోర్టు ఎగ్జామ్ ల కోసం సన్నద్ధమవడం ఓ సవాలైతే, పరీక్షలు జరిగేటప్పుడు పరీక్ష కేంద్రానికి సమయానికి వెళ్లి హాల్ టికెట్ నంబర్లు చూసుకొని పరీక్షలు రాయడం మరో సవాలు. కొంతమంది విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోకపోవడం వల్ల సిబ్బంది లోపలికి పంపించకపోవడం ఆ తర్వాత ఆ విద్యార్థులు చదవు ఓ ఏడాది పాటు వృధా కావడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే గుజరాత్ ఇప్పుడు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఓ తండ్రి తనకున్న హడావిడిలో కూతురుని తప్పుడు పరీక్ష కేంద్రంలో దింపి వెళ్లిపోయాడు. అది గమనించని ఆ విద్యార్థిని సుమారు 15 నిమిషాల పాటు తన రూల్ నంబర్ కోసం ప్రయత్నించింది. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ను చూసి ఆమె మరింత కంగారు పడింది. చివరికి తన తండ్రి ఆమెను తప్పుడు పరీక్షా కేంద్రంలో దింపి వెళ్లిపోయాడని అర్థం చేసుకుంది.

ఆమెకు కావాల్సిన పరీక్ష కేంద్రం దాదాపు అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది. అయితే పరీక్షకు మాత్రం 15 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ విద్యార్థిని ఆవేదనను అర్థం చేసుకున్న పోలీస్ అధికారి తన అధికారిక కారు ఎమర్జెన్సీ హరన్ వేసి ఆమెను తన అసలు పరీక్ష కేంద్రానికి సమయానికి తీసుకొచ్చారు. దీంతో ఆ విద్యార్థిని చదువు ఓ ఏడాది వృధా కాకుండా కాపాడారు. అనంతరం ఆ అమ్మాయి తండ్రిని కనిపెట్టి నిలదీశారు. కూతురుని తప్పుడు పరీక్ష కేంద్రంలో దింపడమే కాకుండా.. అక్కడ ఆమె రోల్ నెంబర్ ఉందో లేదో కూడా చూడకుండా తొందరపాటుగా ఎందుకు వెళ్లావంటూ చివాట్లు పెట్టారు. ఆ అమ్మాయిని పరీక్ష సమయానికి దిగబెట్టిన పోలీస్ అధికారిని నెటీజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..