Punjab: పొలిటికల్ హీట్ పెంచుతున్న సిద్ధూ హత్య.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని గుసగుసలు

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాల(Sidhu Musewala) దారుణ హత్య పంజాబ్(Punjab) లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆయన హత్యకు అసలు కారణమేంటి.. బిష్ణోయ్ కు సిద్ధూకు ఉన్న గొడవలేంటి.. సెక్యూరిటీ తీసేసిన...

Punjab: పొలిటికల్ హీట్ పెంచుతున్న సిద్ధూ హత్య.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని గుసగుసలు
Siddu
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 30, 2022 | 12:36 PM

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాల(Sidhu Musewala) దారుణ హత్య పంజాబ్(Punjab) లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆయన హత్యకు అసలు కారణమేంటి.. బిష్ణోయ్ కు సిద్ధూకు ఉన్న గొడవలేంటి.. సెక్యూరిటీ తీసేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనను మర్డర్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ ఉంటే సిద్ధూ బతికి ఉండే వాడని, రెగ్యులర్ గా వాడే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వాహనంలో ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలు అంతుచిక్కని మిస్టరీగా మారాయి. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా సిద్ధూ బృందంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఎదురుగా రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు ఏకే-47 రైఫిళ్లతో కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో సిద్ధూయే వాహనం నడుపుతున్నారు. తూటాల వర్షంతో.. కూర్చున్న సీటులోనే ఆయన ఒరిగిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో సిద్ధూ స్నేహితులకూ తూటా గాయాలయ్యాయి.

ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సిద్ధూ హత్యోదంతం తెలుసుకున్న ఆత్మీయులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా.. గతేడాది డిసెంబర్​లో సిద్ధూ కాంగ్రెస్​లో చేరారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా(Mansa) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా గతంలో ఆయన వార్తల్లో నిలిచారు.

సిద్ధూ మూసేవాలా హత్య వెనక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉందని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా వెల్లడించారు. ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్ పోలీసు శాఖ అతడికి ఇద్దరు కమాండోలతో రక్షణ కల్పించేది. ఇటీవల వారిని ఉపసంహరించుకుంది. మరో ఇద్దరు అతడికి రక్షణగా ఉంటారు. అయితే, ఘటన సమయంలో కమాండోలను మూసేవాలా వెంట తీసుకెళ్లలేదు. గాయకుడికి ప్రైవేటు బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. దానిని కూడా తీసుకెళ్లలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సిట్ ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి