Minister KTR: రెజ్లర్లకు మద్ధతునిచ్చిన మంత్రి కేటీఆర్.. వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్

లైంగిక వేధింపులపై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. రెజ్లర్లకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు తెలిపారు. రెజ్లర్లు ఒలింపిక్స్‌లో దేశానికి ఖ్యాతి తెచ్చిన సమయంలో సంబురాలు చేసుకున్నామని, న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.

Minister KTR: రెజ్లర్లకు మద్ధతునిచ్చిన మంత్రి కేటీఆర్.. వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్
Wrestlers Protest
Follow us
Aravind B

|

Updated on: Apr 29, 2023 | 7:46 AM

లైంగిక వేధింపులపై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. రెజ్లర్లకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు తెలిపారు. రెజ్లర్లు ఒలింపిక్స్‌లో దేశానికి ఖ్యాతి తెచ్చిన సమయంలో సంబురాలు చేసుకున్నామని, న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరగాలన్నారు. రెజ్లర్లకు న్యాయం జరగాలని కోరారు.

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ తమను వేధింపులకు గురి చేస్తున్నారని, అలాగే లక్నోలోని నేషనల్ క్యాంప్‌లో పలువురు కోచ్‌లు కూడా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫోగాట్‌తో పాటు ఏడుగురు మహిళా రెజర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వివాదం ముదరడంతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీ నివేదిక ఇప్పటి వరకు బయటకి రాలేదు. దీంతో వినేశ్ ఫోగాట్‌తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు జంతర్‌మంత్‌ వద్ద ఆందోళన చేపట్టారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో కేసు నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. మరో వైపు రెజ్లర్లకు పలువురు పార్టీల నాయకులు, మరికొందరు క్రీడాకారులు సైతం మద్దతు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..