‘తమిళనాడు’ స్మగ్లింగ్ సెంటరా..?
ది స్మగ్లింగ్ సెంటర్‌గా తమిళనాడు మారనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. అధికారులు ఎన్ని రకాలుగా.. అక్రమ రవాణాకు చెక్ పెడుతోన్నా.. తమిళనాడులో మాత్రం స్మగ్లింగ్‌లు ఆగడం లేదు. తాజాగా.. మళ్లీ చెన్నైలోని దురైముగం పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లను అధికారులు పట్టుకున్నారు. కంబోడియా నుంచి చెన్నై పోర్టుకి అక్రమంగా.. విదేశీ సిగరెట్లను తరలించారు. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల రూపాయలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) […]
ది స్మగ్లింగ్ సెంటర్‌గా తమిళనాడు మారనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. అధికారులు ఎన్ని రకాలుగా.. అక్రమ రవాణాకు చెక్ పెడుతోన్నా.. తమిళనాడులో మాత్రం స్మగ్లింగ్‌లు ఆగడం లేదు. తాజాగా.. మళ్లీ చెన్నైలోని దురైముగం పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లను అధికారులు పట్టుకున్నారు. కంబోడియా నుంచి చెన్నై పోర్టుకి అక్రమంగా.. విదేశీ సిగరెట్లను తరలించారు. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల రూపాయలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు రెక్కీ నిర్వహించారు. అయితే.. నిందితులకు సంబంధించిన వివరాలు మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ మధ్య తమిళనాడులో చెన్నైని కేరాఫ్ అడ్రస్‌గా చేసుకుంటూ.. అక్రమ రవాణా ఒక రేంజ్‌లో జరుగుతోంది. నిందితులు ఎన్ని రకాలుగా ప్లాన్స్ వేస్తున్నా.. కస్టమ్స్ అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఇటీవలే.. బంగారాన్ని కడుపులో దాచుకుని.. సినిమా సీన్‌ని రిపీట్ చేశారు ఇద్దరు మహిళలు. అనంతరం మహిళలను కిడ్నాప్ చేసి.. వారి నుంచి బంగారాన్ని అపహరించారు స్మగ్లర్లు. ఇంతలా.. వారు దారుణాలకు తెగబడుతున్నారంటే.. వారి వెనుక ఎవరున్నారని.. అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. మెదులుతోంది. దీనిపై రెక్కీ నిర్వహించిన పోలీసులకు పలు ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. బంగారం తరలించడానికి చిన్న ఎయిర్‌పోర్టులను.. టార్గెట్ చేశారు స్మగ్లర్లు. పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉండడం, తరచూ బంగారం పట్టుబడుతుండడంతో చిన్న ఎయిర్ పోర్టుల ద్వారా.. స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.