Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Villupuram Blast Video: తమిళనాడులో దారుణం.. నాటు బాంబులు పేలి తండ్రి కొడుకు దుర్మరణం

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Villupuram Blast Video: తమిళనాడులో దారుణం.. నాటు బాంబులు పేలి తండ్రి కొడుకు దుర్మరణం
Villupuram Blast
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2021 | 3:54 PM

Tamil Nadu Fireworks Blast Incident: తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరో ముగ్గురికి తీవ్రగాయాలు. బైకుపై రెంగు బ్యాగుల్లో నాటు బాంబులు తీసుకెళుతుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. దీంతో నాటు బాంబులు ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయాయి. ఈ పేలుడు ఘటనలో తండ్రీ కే కలైనేశన్(37), కొడుకు ప్రదేష్(7) అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు పదార్థాలు శక్తివంతమైనవి కావడంతో వారి శరీరం తునాతునకలయ్యింది. శరీర అవయవ భాగాలు ఘటనా స్థలికి కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. వారు ప్రయాణిస్తున్న బైక్ ధ్వంసమయ్యింది.  ఈ పేలుడు శబ్ధం ఘటనా స్థలి నుంచి కొన్ని కిలో మీటర్ల దూరానికి వినిపించడంతో స్థానికులు ఉలిక్కపడ్డారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వాహనదారులు సైతం తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. విల్లుపురం డీఐజీ ఎం పాండ్యన్, జిల్లా ఎస్పీ శ్రీనాథ ఘటనా స్థలానికి చేరుకుని.. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు పదార్థాల శ్యాంపిల్స్ సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాటు బాంబు పేలుడు ఘటనలు

Also Read..

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..