Tamil Nadu: బాత్ రూమ్‌లో విద్యార్థి డెలివరీ.. పెన్‌తో బొడ్డు తాడు తెంపి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కొంతమంది మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోతుంటారు. చివరికి మోసపోయామని తెలుసుకున్నాక అందరికీ తెలిస్తే తమ పరువే పోతుందనుకుని.. విషయం బటయకురాకుండా జాగ్రత్తపడతారు. పరువు కోసం ఎలాంటి పనికైనా ఒడిగట్టే రోజులివి. దీనిని అలుసుగా తీసుకుని..
Tamil Nadu: కొంతమంది మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోతుంటారు. చివరికి మోసపోయామని తెలుసుకున్నాక అందరికీ తెలిస్తే తమ పరువే పోతుందనుకుని.. విషయం బటయకురాకుండా జాగ్రత్తపడతారు. పరువు కోసం ఎలాంటి పనికైనా ఒడిగట్టే రోజులివి. దీనిని అలుసుగా తీసుకుని చాలామంది అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే కొన్నిసార్లు దారితప్పి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటివాటిని అరికట్టడానికి ఎన్నో చట్టాలు వస్తున్నా.. వారి వక్రబుద్ధులు మాత్రం మారడంలేదు. కొంతమంది వక్రబుద్ధి కారణంగా మోసపోతున్న అమ్మాయిలు చివరికి కక్కలేక..మింగలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి(ఇంటర్మీడియట్ ఫస్టియర్) చదువుతున్న బాలిక గత గురువారం టాయిలెట్ కు వెళ్లినప్పుడు.. అక్కడే అమ్మాయి ఓబిడ్డకు జన్మనిచ్చింది. ఆఅమ్మాయి గర్భిణి అనే విషయం కుటుంబసభ్యులెవరికి తెలియకపోవడంతో.. విషయాన్ని బయటకు చెప్పలేక.. పెన్నుతో బొడ్డు తాడును కత్తిరించి.. బిడ్డను పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో పడేసింది. తరువాత రోజు శుక్రవారం పాఠశాల మరుగుదొడ్డి సమీపంలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆఘటనపై దర్యాప్తు ప్రారంభించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. చిదంబరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బిడ్డకు జన్మినిచ్చిందని తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిందని తెలియడంతో ఈఘటన సంచలనం సృష్టించింది.
ఈఘటనపై పూర్తిస్థాయిలో విచారించగా.. గత గురువారం (సెప్టెంబర్ 1వతేదీన) పాఠశాలలో ఉండగా టాయిలెట్ కు వెళ్లినప్పుడు పురిటినొప్పులు వచ్చాయని.. ఆసమయంలో విషయం బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో బొడ్డుతాడును పెన్నుతో తెంపినట్లు అమ్మాయి వెల్లడించింది. ప్రసవం అయినవెంటనే సరైన వైద్య సహాయం అందనికారణంగా శిశువు మృతిచెంది ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబసభ్యులతో పాటు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడులోని ఈరోడ్ లో గత ఏడాది కోచింగ్ క్లాసులు తీసుకుంటున్న సమయంలో అక్కడి ఉపాధ్యాయుడు బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో.. అమ్మాయి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన వెలుగులోకి రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..