తమిళనాడులో గ్యాంగ్ వార్స్.. హత్య కేసులో ఇన్‌స్టాగ్రమ్ అమ్మాయి కోసం గాలిస్తున్న పోలీసులు..

తమిళనాడులో గ్యాంగ్‌ వార్స్‌ హడలెత్తిస్తున్నాయి. కోయంబత్తూరు‌లో రెండు రౌడీ గ్యాంగ్‌లు ఉన్నాయి. రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలో..

తమిళనాడులో గ్యాంగ్ వార్స్.. హత్య కేసులో ఇన్‌స్టాగ్రమ్ అమ్మాయి కోసం గాలిస్తున్న పోలీసులు..
Coimbatore Girl Tamanna

Updated on: Mar 10, 2023 | 11:09 AM

తమిళనాడులో గ్యాంగ్‌ వార్స్‌ హడలెత్తిస్తున్నాయి. కోయంబత్తూరు‌లో రెండు రౌడీ గ్యాంగ్‌లు ఉన్నాయి. రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలో.. ఓ యువకుడు చనిపోయాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. ఓ అమ్మాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయే తమన్నా. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ తమన్నా కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

యువకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌తో కలిసి తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్ చేసింది. తన ఇన్‌స్టా అంతా చెక్‌ చేయగా ఆ యువతి సిగరెట్ తాగుతూ, కత్తులతో బెదిరిస్తున్న రీల్స్ కూడా చేసింది. ఈ రీల్స్ గమనించిన పోలీసులు..కచ్చితంగా ఈ హత్య వెనుక ఆ యువతి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి ‘ఫ్రెండ్స్ కాల్ మీ తమన్నా’ అనే పేరుతో అకౌంట్ తెరిచింది. ఈ హత్య జరిగినప్పటి నుంచి ఆ లేడీ రౌడీ కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. హత్య కేసుతో పాటు మరిన్ని దోపిడీ కేసులతోనూ తమన్నాకు, ఆమె గ్యాంగ్‌కు ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుపిస్తున్నారు. అటు, ఆ గ్యాంగ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి