AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయిన తమిళనాడు మంత్రి.. అవాక్కైన ఇతర నేతలు..!

Minister of Tamil Nadu: తమిళనాడు మంత్రి వేలు.. ఏపీ మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఆమె ప్రస్తావించిన వేలు..

Tamil Nadu: మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయిన తమిళనాడు మంత్రి.. అవాక్కైన ఇతర నేతలు..!
Minister
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2022 | 6:00 AM

Share

Minister of Tamil Nadu: తమిళనాడు మంత్రి వేలు.. ఏపీ మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఆమె ప్రస్తావించిన వేలు.. ఒక విషయంలో పప్పులో కాలేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలోని సభ్యులంతా అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకుని.. మీరన్నది తప్పు.. అసలు వాస్తవం ఇదీ అంటూ స్పీకర్‌తో సహా సభ్యులంతా చెప్పడంతో తేరుకున్నారు మంత్రి వేలు. ఆ తరువాత తన ప్రసంగాన్ని సరి చేసుకుని మళ్లీ మాట్లాడారు. ఇంతకీ మంత్రి వేలు.. ఏపీ మంత్రి రోజా గురించి ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం..

తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా.. సీఎం ప్రభుత్వ పాలనపై ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్య నేతలు, రాజకీయ ప్రముఖులు విస్తృతంగా చర్చిస్తున్నారని మంత్రి వేలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఆంధ్రాలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సినీ నటి రోజా.. సీఎం స్టాలిన్ పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా గొప్పగా మాట్లాడారని చెప్పారు. అయితే, మంత్రి రోజా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నారంటూ చెప్పడంతో ఒక్క సారిగా అవాక్కయ్యారు ఎమ్మెల్యేలు. మంత్రి రోజా తెలుగుదేశంలో లేరని, వైస్సార్సీపీలో ఉన్నారని స్పీకర్‌తో సహా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెప్పడంతో తేరుకున్నారు మంత్రి వేలు. ఆ తరువాత అవునా అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, అసెంబ్లీలో మంత్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read:

Summer Fruits: వేసవిలో ఈ 6 పండ్లను తప్పక తీసుకోవాల్సిందే.. బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలు..

Cancer: గొంతు పొడిబారి.. తరచూ దాహం వేస్తుందా..? అయితే ఈ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావొచ్చు..

Health Tips: పులుపెక్కిన నిమ్మధరతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ లోటు పూడినట్లే