Cancer: గొంతు పొడిబారి.. తరచూ దాహం వేస్తుందా..? అయితే ఈ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావొచ్చు..
Bowel Cancer symptoms: వేసవి కాలం మొదలైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. వేసవిలో గొంతు పొడిబారడం, దాహం వేయడం సర్వసాధారణం. ఇలా అనిపిస్తే..
Bowel Cancer symptoms: వేసవి కాలం మొదలైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. వేసవిలో గొంతు పొడిబారడం, దాహం వేయడం సర్వసాధారణం. ఇలా అనిపిస్తే.. శరీరానికి నీరు అవసరమని అర్థం. తద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. అదే సమయంలో గొంతు తరచుగా పొడిగా అనిపించడం.. అధిక దాహం వేయడం ప్రమాదకర వ్యాధులకు సంకేతం అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. నీరు తాగిన తర్వాత కూడా మీకు చాలా దాహం వేస్తున్నట్లు అనిపించినా.. దాహాన్ని నియంత్రించలేకపోయినా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు డాక్టర్ మొదట మధుమేహం పరీక్ష చేయించాలని సూచిస్తారు. ఎందుకంటే ఈ సమస్య డయాబెటిస్ సాధారణ లక్షణాలలో ఒకటి. అయితే మధుమేహం పరీక్షలో నెగిటివ్ అని తేలి.. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లయితే.. కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకు అలా జరుగుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నీరు తాగినప్పటికీ తరచుగా దాహం వేయడం అనేది.. పేగుకు సంబంధించిన కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. తరచుగా దాహం వేయడానికి కారణాలలో ఒకటి పెద్దప్రేగు క్యాన్సర్.
పెద్దప్రేగు క్యాన్సర్ శరీరంలో చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీని లక్షణాలు చాలా కాలం తర్వాత కనిపిస్తాయి. కానీ ముందుగానే గుర్తించినట్లయితే ఈ తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు. పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నప్పుడు నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తే, అది హైపర్‌కాల్సెమియాకు కారణమవుతుంది. దెబ్బతిన్న ఎముకల నుంచి కాల్షియం రక్తంలోకి విడుదలైనప్పుడు ఇది సంభవిస్తుంది. దీని కారణంగా రోగికి చాలా దాహం అనిపిస్తుంది.
ప్రేగు క్యాన్సర్ లక్షణాలు
– ప్రేగు అలవాట్లలో మార్పు
– మలంలో రక్తం
– కడుపు నొప్పి, అసౌకర్యం, ఉబ్బరం
– మలబద్ధకం
– మలద్వారం, పురీషనాళం చుట్టూ గడ్డలు
– బరువు తగ్గడం
– మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, అలాగే మూత్రం రంగులో మార్పులు
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. తద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి.. దాని ప్రమాదకరమైన ప్రభావాలను నివారించవచ్చు.
ప్రేగు క్యాన్సర్ కారణాలు
ఈ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు ఉన్నాయి..
వయస్సు- 60 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధిని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఆహారం- ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినడం, తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
బరువు – అధిక బరువు-ఊబకాయం ఉన్నవారికి ఇతరులకన్నా పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఆల్కహాల్- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వంశపారపర్యం- తల్లిదండ్రులకు ఈ వ్యాధి ఉంటే.. వారి పిల్లలకు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ.
Also Read: