Headaches: 4 రకాల తలనొప్పులు.. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు? కారణం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..!

ప్రపంచ జనాభాలో 50 శాతం మంది కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా తలనొప్పితో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. చాలా మంది తలనొప్పి ఒకే రకమైనదిగా చెబుతారు.

Shiva Prajapati

|

Updated on: Apr 11, 2022 | 6:51 AM

ప్రపంచ జనాభాలో 50 శాతం మంది కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా తలనొప్పితో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. చాలా మంది తలనొప్పి ఒకే రకమైనదిగా చెబుతారు. అయితే ఇది తప్పు అని పరిశోధకులు చెబుతున్నారు. క్లీవ్‌ల్యాండ్ నివేదిక ప్రకారం.. 150 రకాల తలనొప్పులు ఉన్నాయట. అందులోనూ వీటిని 4 వర్గాలుగా అర్థం చేసుకోవచ్చు అని పరిశోధకులు పేర్కొన్నారు. చాలా మంది ప్రజలు ఈ 4 రకాల్లో ఏదో ఒక రకమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారని పేర్కొన్నారు. మరి ఆ 4 రకాల తలనొప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మైగ్రేన్: ఇది మొదటి రకం తలనొప్పి. తలకు ఒకవైపు నొప్పి వస్తుంది. దీని కేసులు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తాయి. ఈ తలనొప్పి ప్రభావం కంటి చూపుపై కూడా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు కాంతి, శబ్దం విషయంలో చాలా సున్నితంగా ఉంటారు.

2 / 5
క్లస్టర్: ఈ తలనొప్పి ప్రభావం కళ్లపై స్పష్టంగా ఉంటుంది. ఇది అడపాదడపా జరుగుతుంది. అలాంటి నొప్పి వచ్చినప్పుడు అశాంతి, కళ్లలో నీళ్లు రావడం, ముక్కు మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. ఈ నొప్పి రోజుకు ఎనిమిది సార్లు వస్తుంది. ఇది రెండు వారాల నుండి మూడు నెలల వరకు ఉంటుంది. వాతావరణంలో మార్పు, మద్యం, ధూమపానం దీనికి కారణం కావచ్చు.

3 / 5
టెన్షన్: ఈ రకమైన నొప్పి తల రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ నొప్పి 7 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం లేదా కండరాలలో సమస్య కారణంగా ఈ నొప్పి వస్తుంది. ఈ సమస్యలను నియంత్రిస్తే తలనొప్పి తగ్గొచ్చు.

4 / 5
సైనస్: ఈ నొప్పి కళ్ల చుట్టూ వస్తుంది. ముక్కు మూసుకుపోతుంది. సాధారణంగా ఈ నొప్పికి కారణం బ్యాక్టీరియా. శ్లేష్మం అడ్డుపడటం వలన దాని ప్రభావం కంటిపైనే పడుతుంది. మీకు తలనొప్పి అనిపించినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోండి. తద్వారా సరైన చికిత్స పొందవచ్చు.

5 / 5
Follow us