- Telugu News Photo Gallery Mint Health Benefits Five Amazing Benefits Of Dietary Mint Know the Details
Five Benefits Of Mint: పూదీనాతో ఐదు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో ఓ లుక్కేయండి..
ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వేసవిలో పూదీనా చాలా ప్రయోజనకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Updated on: Apr 11, 2022 | 7:07 AM

ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వేసవిలో పూదీనా చాలా ప్రయోజనకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, మెంథాల్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. పుదీనాను చేర్చడం వల్ల కడుపులోని ఆమ్లత్వం, ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది.

పుదీనా కండరాలకు విశ్రాంతినిస్తుంది. ఇవి కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా రోజు పూదీ రసాన్ని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పూదీనా ఆకులు తినడం వలన ఒత్తిడి, నిరాశను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై మొటిమలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

పుదీనా ఆకుల్లో సాలిసిలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.

పుదీనా ఆకులను నమలడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే దీన్ని మౌత్‌వాష్‌గా ఉపయోగించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను చంపి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. (ఈ కథనంలోని సమాచారం సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని నిపుణుల సలహాల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.)




