CM MK Stalin: 6వ తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన సీఎం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
Tamil Nadu CM MK Stalin calls up girl: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తనమార్కు పాలనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ
Tamil Nadu CM MK Stalin calls up girl: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తనమార్కు పాలనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ సాదాసీదాగా ఉండే.. ఎవరూ ఊహించని రీతిలో.. నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆరవ తరగతి విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను నవంబర్ 1 నుంచి తెరవనున్నట్లు ఆ అమ్మాయికి సీఎం స్టాలిన్ చెప్పి ప్రేమతో సంభాషించారు. పాఠశాలకు వెళ్లేటపుడు టీచర్ సూచనలు పాటించాలని.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలంటూ.. స్టాలిన్ ఆమెకు పలు సూచనలు చేశారు.
కాగా.. తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లోని హొసూరు టైటాన్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న రవికుమార్, ఉదయకుమారి దంపతుల కుమార్తె ప్రజ్ఞా.. ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆరో తరగతిలో చేరేందుకు పాఠశాలలు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో తెలుసుకోవడానికి ప్రజ్ఞా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో తన ఫోన్ నెంబర్‌ను కూడా రాసింది. పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారో చెప్పాలంటూ ఆమె లేఖలో రాసింది. అయితే.. పేషికి వచ్చిన చిన్నారి లేఖ చదివిన సీఎం స్టాలిన్ తనకున్న బిజీ షెడ్యూల్‌ను పక్కన బెట్టిమరి ప్రజ్ఞాకి ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ఘటన అనంతరం ప్రజ్ఞా మాట్లాడుతూ.. సీఎం తనతో ఫోన్‌లో మాట్లాడటాన్ని నమ్మకలేకపోతున్నానని ఆనందం వ్యక్తంచేసింది. సీఎం ఫోన్ చేస్తారని అస్సలు ఊహించలేదంటూ పేర్కొంది.
Also Read: