తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనవంతురాలు.. ఆమె అస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సాధారణంగా సినిమా వాళ్ల గురించి వాళ్ళ ఆస్తులు.. రెమ్యునేషన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో పోటీలో నిలిచే అభ్యర్థులు ఆస్తులు గురించి సైతం అంతే ఆసక్తి ఇటీవల కాలంలో పెరిగింది. తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా లాల్ గుడి నియోజకవర్గం నుచి ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి ఆస్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనవంతురాలు.. ఆమె అస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Leema Rose

Edited By:

Updated on: Apr 07, 2026 | 5:33 PM

సాధారణంగా సినిమా వాళ్ల గురించి వాళ్ళ ఆస్తులు.. రెమ్యునేషన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో పోటీలో నిలిచే అభ్యర్థులు ఆస్తులు గురించి సైతం అంతే ఆసక్తి ఇటీవల కాలంలో పెరిగింది. తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా లాల్ గుడి నియోజకవర్గం నుచి ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి ఆస్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లు కాదు ఏకంగా వేల కోట్ల ఆస్తిని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు ఆ మహిళా అభ్యర్థి. ఇంతకీ తమిళనాడులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ మహిళా అభ్యర్థి ఎవరు? ఆమె ఆస్తి ఎన్ని కోట్లు..?

తమిళనాడులో ప్రస్తుతం అందరూ చూపు ఎన్నికల పైనే ఉంది. ఇప్పటికే డిఎంకె , అన్నా డీఎంకే, టివికె తో పాటు అన్ని పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు. తాజాగా అన్న డీఎంకే పార్టీ తరఫున లాల్‌గుడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి తన అఫిడవిట్ లో పొందుపరిచిన ఆస్తుల విలువ చూసి తమిళనాడు మొత్తం సైతం ఆమె వైపే చూస్తుంది. లాల్‌గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ ఏప్రిల్ 6న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె రూ. 5,863 కోట్ల ఆస్తులను ప్రకటించి, బరిలో ఉన్న అభ్యర్థులలో అత్యంత ధనికురాలిగా నిలిచారు

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీమా రోజ్, తన ఆస్తుల విలువను ఏకంగా రూ 5,863 కోట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే తమిళనాడులో నామినేషన్ పర్వం మొదలవడంతో ఒక్కొక్కరుగా తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరుస్తున్నారు. ఇటీవల టీవీకే పార్టీ అధినేత విజయ్ సైతం తన ఆస్తులను ప్రకటించడం తెలిసిందే. అయితే తాజాగా అన్నా డీఎంకే పార్టీ నుంచి లాల్‌గుడి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న లీమా రోస్ అనే అభ్యర్థి తన కుటుంబ మొత్తం ఆస్తుల విలువ రూ.5.863 కోట్లుగా ప్రకటించారు. అఫిడవిట్ ప్రకారం లీమా రోస్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

లీమా రోస్ నామినేషన్ పత్రాలు ఆమె భర్త, లాటరీ దిగ్గజం శాంటియాగో మార్టిన్ ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాయి. మార్టిన్ ప్రస్తుతం రూ. 4,159 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. వారి కుమారుడు జోస్ మార్టిన్‌కు రూ. 665 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఆమె నామినేషన్ పత్రాలలో పేర్కొన్నారు. ఆసక్తికరంగా, లీమా రోజ్‌తో పాటు, మార్టిన్స్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు తమిళనాడు, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. శాంటియాగో మార్టిన్ పెద్ద కుమారుడు, లచ్చియ జననాయక కచ్చిని స్థాపించి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న చార్లెస్ జోస్ మార్టిన్, రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో కామరాజ్ నగర్, నెల్లితోప్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. శాంటియాగో మార్టిన్స్ అల్లుడు, ఆధవ్ అర్జున, విజయ్ తమిళగ వెట్రి కజగం తరపున చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

ఇదిలావుంటే,  ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన దాతల ఈసీఐ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత శాంటియాగో మార్టిన్ వార్తల్లో నిలిచారు. ఈసీఐ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 మధ్య కాలంలో, మార్టిన్స్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఏఐటీసీకి రూ. 542 కోట్లు, డీఎంకేకు రూ. 503 కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ. 154 కోట్లు, బీజేపీకి రూ. 100 కోట్లు, ఐఎన్‌సీకి రూ. 50 కోట్లు, ఇతర రాజకీయ పార్టీలకు రూ. 19 కోట్లు విరాళంగా ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us