AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్‌తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?

2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన విషయం బయటపెట్టారు. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లో వేగం పెంచిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్‌తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?
Tvk Chief Vijay Cases
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 7:16 PM

Share

2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన విషయం బయటపెట్టారు. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లో వేగం పెంచిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ గుర్తింపు, ఇతర లాంఛనాల కోసం ఈ కొత్త అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందులో తన వ్యక్తిగత, న్యాయపరమైన వివరాలను పొందుపరిచారు.

ఇప్పటివరకు వివాదరహితుడిగా, క్లీన్ ఇమేజ్‌తో ఉన్న దళపతి విజయ్ తనపై కేసులు ఉన్నట్లు అంగీకరించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రెండు కేసులు ఏ విషయానికి సంబంధించినవి, వాటి తీవ్రత ఎంత అనే దానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల నాటికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే విజయ్ ఈ వ్యూహాత్మక అడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముందే పారదర్శకంగా వివరాలు వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇవ్వకూడదని ఆయన ముందు జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే టీవీకే శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎన్నికల పనులను ముమ్మరం చేశాయి. ఈ తాజా అఫిడవిట్ సమర్పణతో విజయ్ తన రాజకీయ అరంగేట్రానికి అధికారికంగా, న్యాయపరంగా అన్ని రకాల అడ్డంకులను తొలగించుకునే పనిలో పడ్డారని స్పష్టమవుతోంది.

మరోవైపు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలు విజయ్ తాజా ప్రకటనను నిశితంగా గమనిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ పెండింగ్ కేసుల అంశాన్ని ప్రధాన ఆయుధంగా వాడుకునేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు ఉన్నాయన్న వార్త బయటకు వచ్చినా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఇవి కేవలం రాజకీయ కుట్రల్లో భాగంగా బనాయించిన కేసులే అని, వ్యవస్థపై పోరాడుతున్న తమ నాయకుడికి ఇవి సాధారణమే అని వారు బలంగా నమ్ముతున్నారు.

ఇటీవల నిర్వహించిన టీవీకే తొలి రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది హాజరై సక్సెస్ చేశారు. నేరుగా ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విజయ్ దెబ్బకు తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న ద్వంద్వ రాజకీయాలకు తెరపడేలా కనిపిస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. న్యాయపరమైన సవాళ్లను ముందుగానే అంగీకరించి, రాజకీయ రణరంగానికి సిద్ధమైన దళపతి విజయ్ అసలైన రాజకీయ పరీక్ష ఇక అధికారికంగా మొదలైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us