Modi New Cabinet: మీడియా విషయంలో జాగ్రత్త! కొత్త మంత్రులకు పీఎం మోదీ సలహా..

జీరోను హీరోగా చేసేది మీడియానే.. అలాగే హీరోను క్షణాల్లో జీరోగా మార్చేది మీడియానే. అంతటి పవర్‌ ఉన్న మీడియాతో జాగ్రత్తగా ఉండాలని సాక్షాత్తూ..

Modi New Cabinet: మీడియా విషయంలో జాగ్రత్త! కొత్త మంత్రులకు పీఎం మోదీ సలహా..
Modi Cabinet

Edited By: Janardhan Veluru

Updated on: Jul 08, 2021 | 10:11 AM

జీరోను హీరోగా చేసేది మీడియానే.. అలాగే హీరోను క్షణాల్లో జీరోగా మార్చేది మీడియానే. అంతటి పవర్‌ ఉన్న మీడియాతో జాగ్రత్తగా ఉండాలని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవునండీ.! ఇది నిజమే. ఆయన కొత్త మంత్రులకు మీడియాతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు తన నివాసంలో కొత్త, పాత మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు ఇచ్చారు.

సమర్థవంతంగా పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సాధారణంగా చెప్పే మాటలతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా వ్యవహరించాలని నొక్కి చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో మీడియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని సూచించినట్టు సమాచారం. మీడియా ముందు నోరు జారొద్దని, వాళ్లు అడిగే ప్రశ్నల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే మీడియాను పూర్తిగా దూరం పెట్టొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా మసలుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.

అలాగే జూలై 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో శాఖాపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా.. శాఖలపై పట్టు సాధించాలని కొత్త మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఎన్డీయే 2.0 ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల కాలంలో కరోనా సంక్షోభం, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం అంశాలపై తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ముఖ్యంగా కొన్ని కీలక రంగాల్లో సర్కార్ ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు సైతం ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతినకుండా ఉండాలంటే మీడియా విషయంలో జాగ్రత్తలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్‌తో నెలకొన్న వివాదమే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉద్వాసనకు కారణమైందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త మంత్రులు మీడియా విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.

Also Read:

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!

సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్‌ క్యాలెండర్‌ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!