Suraj Revanna: మగ కార్యకర్తపై అసహజ లైంగికదాడి.. సూరజ్‌ రేవణ్ణ అరెస్ట్‌

జేడీఎస్‌ కార్యకర్తపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి రేవణ్ణ తనయుడు సూరజ్‌ అరెస్ట్‌ కావడం కర్నాటక రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటున్నారు రేవణ్ణ కుటుంబసభ్యులు

Suraj Revanna: మగ కార్యకర్తపై అసహజ లైంగికదాడి.. సూరజ్‌ రేవణ్ణ అరెస్ట్‌
Suraj Revanna
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2024 | 8:24 PM

మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబాన్ని వరుస లైంగిక వేధింపుల కేసులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మాజీమంత్రి రేవణ్ణ చిన్నకొడుకు ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో కటకటాల్లో ఉంటే, ఆయన పెద్ద కొడుకు కూడా ఇలాంటి కేసులోనే అరెస్ట్‌ అయ్యాడు. అయితే పార్టీ కార్యకర్తపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యారు సూరజ్‌ రేవణ్ణ. ఈ కేసును కేసును CIDకి బదిలీచేసింది కర్నాటక ప్రభుత్వం. ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణపై అసహజ లైంగికచర్య ఆరోపణలు వచ్చాయి. 27 ఏళ్ల జేడీఎస్‌ కార్యకర్తపై సూరజ్‌ లైంగికదాడికి సంబంధించి కేసు నమోదైంది. హసన్‌ జిల్లాలోని ఫామ్‌హౌస్‌లో ఈనెల 16న సూరజ్‌ రేవణ్ణ లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సూరజ్‌ రేవణ్ణని అరెస్ట్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను సూరజ్‌ రేవణ్ణ తోసిపుచ్చారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వనందుకే ఆరోపణలు చేశాడని అంటున్నారు సూరజ్‌ రేవణ్ణ.

సూరజ్‌ రేవణ్ణ తనపై లైంగికదాడి చేసినట్టు బాధితుడు స్వయంగా కర్నాటక డీజీపీకి ఫిర్యాదు చేశాడు. సూరజ్‌ రేవణ్ణ జేడీఎస్‌ తరపున ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022లో హసన్‌ జిల్లా స్థానిక సంస్థల నుండి శాసనమండలికి ఎన్నికయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను సీఐడీ అధికారులు లోతుగా విచారించారు. మహిళలపై అత్యాచారం కేసులో ఇప్పటికే జైలు పాలయ్యాడు ప్రజ్వల్‌ రేవణ్ణ. అశ్లీల వీడియో కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ యువకుడిని సూరజ్‌ ట్రాప్‌ చేసినట్టు తెలుస్తోంది. ఫాంహౌస్‌లో అత్యాచారం చేసిన తరువాత ఆవిషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించినట్టు చెబుతున్నారు. అయితే తనపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సూరజ్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..