8 వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాల్సిందే.. వీధికుక్కలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
దేశరాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కన్పించరాదని, షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి. జంతు ప్రేమికులతో పాటు పలువురు సెలబ్రిటీలు సుప్రీం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ.
Updated on: Aug 12, 2025 | 9:14 PM

దేశరాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కన్పించరాదని, షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి. జంతు ప్రేమికులతో పాటు పలువురు సెలబ్రిటీలు సుప్రీం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ.

అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వేగంగా వెళ్లకూడదు. కుక్కలు కూర్చున్న ప్రదేశానికి సమీపంలో నెమ్మదిగా వెళ్లడం మంచిది. మీరు అధిక వేగంతో ఉన్నప్పటికీ వాటి సమీపంలోకి వెళ్లగానే బైక్ వేగాన్ని తగ్గించుకోవాలి.

ఢిల్లీ NCR పరిధిలో వీధికుక్కలను 8 వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పలువురు సెలబ్రిటీలు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. రాహుల్, ప్రియాంకతో పాటు మేనకాగాంధీ ఈ వ్యవహారంపై స్పందించారు. వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దశాబ్దాల మానవీయ విలువల నుంచి ఇది వెనకడుగని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ నోరులేని జీవాలను తుడిచిపెట్టేయాల్సి రావడం సమస్యకు పరిష్కారం కాదని రాహుల్ అన్నారు.

వాస్తవానికి కుక్కకాటు ఒక జాతీయ సమస్యగా మారింది. దీంతో ఢిల్లీకి సంబంధించి కీలక ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. రేబిస్ వ్యాధితో మరణాల సంఖ్య పెరగడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని హుకుం జారీ చేసింది. కుక్కల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

సుప్రీంకోర్టు జంతుప్రేమికులకు చురకలంటించింది. ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల పిటిషన్లను విచారించబోమని కోర్టు స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించక తప్పదన్నది ఆదేశాల సారాంశం. వీధికుక్కల తరలింపు ప్రదేశాన్ని కూడా గుర్తించామన్న సొలిసిటర్ జనరల్, జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో షెల్టర్ పనులు ఆగిపోయాయి అన్నారు.

రేబిస్‌తో పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకొస్తారా? అని జంతు ప్రేమికుల్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా నో చెప్పింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరునెలల్లోనే ఢిల్లీలో 35 వేల మంది కుక్కకాటుతో ఆస్పత్రిపాలయ్యారు. అందుకే, సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్‌కు ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.




