విజయ్ మాల్యా అభ్యర్థనపై సుప్రీంకోర్టులో ఈ నెల 20 న విచారణ
'ఫ్యుజిటివ్ బిజినెస్ మన్' విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఈ నెల 20 న విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది.
‘ఫ్యుజిటివ్ బిజినెస్ మన్’ విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఈ నెల 20 న విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఇందుకు తనను దోషిగా పేర్కొంటూ.. 2017 లో కోర్టు ఇచ్చిన రూలింగ్ ని రివ్యూ చేయవలసిందిగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతూ..ఈ నెల 20 న దీన్ని లిస్ట్ లో పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో ఓ డాక్యుమెంట్ కనబడని కారణంగా ఆ రోజుకు విచారణ వాయిదా వేసింది.
గత మూడేళ్ళుగా మాల్యా రివ్యూ పిటిషన్ ని సంబంధిత కోర్టులో ఎందుకు లిస్ట్ చేయలేదో వివరించవలసిందిగా కూడా రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్ కి సంబంధించిన ఫైల్ ని ఏయే అధికారులు డీల్ చేశారో వారి పేర్లతో సహా అన్ని వివరాలను సమర్పించాలని వారు సూచించారు.
ఇండియాలోని బ్యాంకులకు రూ. తొమ్మిది వేల కోట్ల శఠగోపం పెట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా.. తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని బ్యాంకుల కన్సార్టియం లోగడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.