బెయిల్ ఆర్డర్ కాపీల కోసం జైలు అధికారులు ‘పావురాలపై’ ఆధారపడుతున్నారా ..? సుప్రీంకోర్టు ఎద్దేవా

ఈ ఇంటర్నెట్ రోజుల్లోనూ జైలు అధికారులు కోర్టుల.నుంచి వచ్చే బెయిల్ ఉత్తర్వుల కోసం 'పావురాలపై' ఆధార[పడుతున్నట్టు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బెయిల్ ఆర్డర్ కాపీల కోసం జైలు అధికారులు 'పావురాలపై' ఆధారపడుతున్నారా ..? సుప్రీంకోర్టు ఎద్దేవా
Supreme Court

ఈ ఇంటర్నెట్ రోజుల్లోనూ జైలు అధికారులు కోర్టుల నుంచి వచ్చే బెయిల్ ఉత్తర్వుల కోసం ‘పావురాలపై’ ఆధారపడుతున్నట్టు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వారు పాత కాలం నాటి ఈ విధానాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. నిందితులను బెయిల్ పై విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్న సంఘటనలు పెరిగిపోతుండటం పట్ల కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాలు తమతమ పరిధుల్లోని జైళ్లు ఇంటర్నెట్ సౌకర్యాలు కలిగి ఉన్నాయా..బెయిలుపై విడుదలయ్యే ఖైదీల విషయంలో అవి తీసుకున్న లేదా తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని కూడా సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సూచించింది. బెయిలుకు సంబంధించి తమ ఉత్తర్వుల విషయంలో ఓ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మిషన్ మెకానిజం ను రూపొందిస్తామని ఈ బెంచ్ తెలిపింది. దీనివల్ల బెయిలుపై ఖైదీల విడుదల విషయంలో జాప్యం జరగకుండా చూడవచ్చునని పేర్కొంది. డైరెక్ట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మోడ్ ఏర్పాటుకు అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ దుశ్యంత్ దవే,, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను సంప్రదించాలని తమ కోర్టు సెక్రటరీ జనరల్ ను బెంచ్ ఆదేశించింది.

ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో ఖైదీల వయస్సు, వారి ఇతర స్థితి గతులను హైపవర్ కమిటీలు పరిశీలిస్తున్నాయో లేదో తమకు తెలియదని కోర్టు పేర్కొంది. కోర్టులు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు ఖైదీలను రిలీజ్ చేయడంలో ఆలస్యం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్ పై కోర్టుతనంతట తానుగా విచారణ చేపట్టింది. నేరానికి పాల్పడినప్పుడు బాల్య వయస్సులో ఉన్న 13 మందిని జువెనైల్ బోర్డు ఆ తరువాత జైలుకు పంపగా వారు 14 ఏళ్ళ శిక్ష అనుభవించారని, వారిని తాత్కాలిక బెయిలుపై విడుదల చేయాలనీ సుప్రీంకోర్టు ఈ నెల 8న యూపీ ప్రభుక్త్వాన్ని ఆదేశించింది. కానీ తమకు ఈ ఆర్థర్ కు సంబంధించి కాపీలు అందలేదంటూ యూపీ అధికారులు వారిని విడుదల చేయలేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఆ ఏటీఎమ్‌లకే ఎందుకు వెళ్లాలంటే.. ఎస్‌బీఐలో ఉచితంగా అందిస్తోన్న సేవలు తెలుపుతూ.

రానున్న 100 రోజులు అప్రమత్తం కావలసిందే..లేని పక్షంలో.. కేంద్రం హెచ్చరిక

Click on your DTH Provider to Add TV9 Telugu