Shri Krishna Janmabhoomi Case: మధుర కృష్ణ జన్మభూమి వివాదం.. సుప్రీంకోర్టులో ముస్లిం సంస్థలకు ఎదురుదెబ్బ
ఉత్తర ప్రదేశ్‌లోని మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలన్నఅలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలన్నఅలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై, వివాదాస్పద సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసులను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని సవాలు చేసిన మసీదు తరపు పిటిషన్ తమ ముందు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని జనవరి 9న విననున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చారు. వాస్తవానికి వారణాసిలోని జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్ మాదిరిగానే, మధురలోని ఈద్‌గాగ్ కాంప్లెక్స్‌ను కూడా సర్వే చేయాలని ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 14న అలహాబాద్ హైకోర్టు శ్రీకృష్ణ జన్మస్థలం పక్కనే ఉన్న ఈద్గా కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అంతకుముందు శ్రీకృష్ణుడి జన్మస్థలంపై మసీదు నిర్మించారని హిందూ సంస్థలు చాలా రోజుల నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. మసీదులో సర్వే నిర్వహించాలని గత ఏడాది డిసెంబర్‌లో కోర్టులో పిటిషన్ కూడా వేశాయి. అయితే షాహీ ఈద్గాలో సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని హైకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గాకు చెందిన 13.37 ఎకరాలను ఆలయానికి అప్పగించాలని లక్నోకు చెందిన రంజన అగ్నహొత్రి పిటిషన్ వేశారు. అయితే 1991 ప్రార్థనా స్థలాల చట్టం కింద పిటిషన్‌ను కొట్టేయాలని ముస్లిం సంస్థలు కౌంటర్ దాఖలు చేశాయి.
షాహీ ఈద్గా- శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టులో మొత్తం 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ కేసుల విచారణను మథుర లోని స్థానిక కోర్టుకు బదిలీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…