Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wild Animals Attack: ఉత్తరాఖండ్‌లో వన్యప్రాణుల భీభత్సం.. ప్రాణాలు కోల్పోయిన 11 మంది, పదుల సంఖ్యలో క్షతగాత్రులు

ఉత్తరాఖండ్‌లో చలికాలం ప్రారంభమైన వెంటనే అడవి జంతువుల జనావాసాల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో గత రెండు నెలల్లో అడవి జంతువులు 11 మందిని బలి తీసుకున్నాయి. దీంతో అడవి చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో వన్యప్రాణుల దాడులపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీశాఖ తీరుపై గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు.

Wild Animals Attack: ఉత్తరాఖండ్‌లో వన్యప్రాణుల భీభత్సం.. ప్రాణాలు కోల్పోయిన 11 మంది, పదుల సంఖ్యలో క్షతగాత్రులు
Tiger Terror
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 15, 2023 | 2:20 PM

ఉత్తరాఖండ్‌లో చలికాలం ప్రారంభమైన వెంటనే అడవి జంతువుల జనావాసాల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో గత రెండు నెలల్లో అడవి జంతువులు 11 మందిని బలి తీసుకున్నాయి. దీంతో అడవి చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో వన్యప్రాణుల దాడులపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీశాఖ తీరుపై గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు.

వన్యప్రాణుల నుంచి రక్షణకు అటవీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక విభాగాల నిపుణులు ఉన్నారు. గత రెండు నెలల్లో అడవి జంతువుల దాడిలో 306 మంది గాయపడగా, 11 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ శాస్త్రవేత్త, పులుల నిపుణుడు డాక్టర్ వై.పి.ఝాలా తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా చిరుతలు, పులులు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగినందున వన్యప్రాణుల దాడుల సైతం పెరుగుతున్నాయన్నారు. వన్యప్రాణుల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

శీతాకాలం మొదలు కాగానే అడవుల్లో వన్యప్రాణులకు ఉండేందుకు స్థలం, ఆహార సదుపాయాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఈ జంతువులు నివాస ప్రాంతాల వైపు వెళ్తున్నాయి. దీంతో మనుషులపై వాటి దాడులు పెరుగుతున్నాయి. ఇది కాకుండా, పంటలు పెద్దగా పెరిగినప్పుడు, జంతువులు పంటల కోసం జనాపాల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు మరణించిన 11 మందిలో 6 మంది చిరుత పులుల దాడుల కారణంగా మరణించారు. పెద్ద పులి, ఎలుగుబంటి లేదా ఏనుగు దాడి కారణంగా మరో 5 మంది మరణించారు.

ఇందులో 9 సంఘటనలు ఒక్క కుమావున్‌లోనే జరిగాయి. నైనిటాల్, రామ్‌నగర్, అల్మోరా, పితోర్‌ఘర్ మరియు ఉధమ్ సింగ్ నగర్‌లలో అత్యధిక సంఘటనలు జరిగాయి. వన్యప్రాణుల దాడులను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. అటవీ శాఖ నిరంతరం ప్రయత్నిస్తోంది. వన్యప్రాణుల దాడులను వేగంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…