AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు.. విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలంటూ..

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ అలాగే ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది.

Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు.. విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలంటూ..
Mukesh Ambani Family
Basha Shek
|

Updated on: Mar 01, 2023 | 7:11 AM

Share

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ అలాగే ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీముఖేష్ అంబానీనే భరిస్తారని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా అంబానీ సెక్యూరిటీ గురించి త్రిపుర కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఆ పిటిషన్ లో అంబానీ కుటుంబం భద్రత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమా? దేశ విదేశాల్లోనూ అమలు చేస్తరా? అన్న అంశాలపై స్పష్టత నివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ముఖేష్‌ అంబానీ ఇండియాలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.

Z+ సెక్యూరిటీ అంటే..

Z + సెక్యూరిటీలో భాగంగా ఎప్పుడూ అంబానీ ఫ్యామిలీ చుట్టూ మొత్తం 58 మంది కమాండోలు ఉంటారు. వీరితో పాటు 10 మంది సాయుధ స్టాటిక్ గార్డ్‌లు, 24 మంది జవాన్లు 2 ఎస్కార్ట్స్‌ రెండు షిఫ్టులలో పనిచేస్తారు. వీరందరికి ఇన్‌స్పెక్టర్ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు.

ముఖేశ్‌, బిగ్‌బీ ఇళ్లను పేల్చేస్తాం..

కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి మరోసారి బెదిరింపు కాల్‌ వచ్చింది. ముఖేశ్‌ ఇంటితో పాటు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్, మరో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నాగ్‌పూర్ పోలీసులు ముంబాయి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబాయి నరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఈ కాల్ వచ్చిన ఐపిఎ చిరునామా, నిందితుల ఆచూకి తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..