Interpol Warning: ఆ యాప్‌లను వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఇంటర్‌పోల్ అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్..
Interpol Warning: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రకరకాలుగా ప్రజలు బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు.
Interpol Warning: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రకరకాలుగా ప్రజలు బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయని చెప్పాలి. సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్స్ పేరుతో ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ హెచ్చరికలు జారీ చేసింది. డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని, కొంచెం తేడా వచ్చినా మీ ఖాతాల్లోని సొమ్మును కోల్పోవాల్సి వస్తుందని ప్రజలను ఇంటర్‌పోల్ హెచ్చరించింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లకు సంబంధించి ఇటీవలి కాలంలో ఇంటర్‌పోల్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయట.
ఈ నేపథ్యంలో దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇంటర్‌పోల్ అధికారులు.. 194 దేశాలకు చెందిన ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్‌ల సాయంతో ప్రజలను దోచుకునేందుకు మోడస్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారంటూ ప్రజలను అలర్ట్ చేశారు. డేటింగ్ యాప్‌ల ద్వారా సంబంధిత వ్యక్తులతో పరిచయం పెంచుకుని ఆపై సొమ్మును కొల్లగొడతారిన అన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ పెట్టుబడులు అంటూ వచ్చే ఆఫర్లను కూడా గుడ్డిగా అనుసరించొద్దని ప్రజలకు ఇంటర్‌పోల్ అధికారులు హితవుచెప్పారు. వీటితో పాటు మరికొన్ని సూచనలు కూడా చేశారు. వ్యక్తిగత, రహస్య సమారాన్ని గుర్తు తెలియని వ్యక్తుల ఎదుట బహిర్గతం చేయొద్దన్నారు. తెలియని వ్యక్తి సంప్రదించినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. డేటింగ్ యాప్‌లలో డబ్బును బదిలీ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఇంటర్‌పోల్ అధికారులు సూచించారు.
Also read:
సరికొత్త రికార్డు సొంతం చేసుకున్న భారత రైల్వే.. పట్టాలపై పరుగులు పెట్టిన అత్యంత పొడవైన గూడ్స్ రైలు