AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్ది.. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్ల సమావేశంలో ప్రధాని మోదీ

వోకల్‌ ఫర్‌ లోకల్‌ .. నినాదాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు మోదీ. ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌ మన లక్ష్యమన్నారు.

యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్ది.. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్ల సమావేశంలో ప్రధాని మోదీ
Balaraju Goud
| Edited By: Sanjay Kasula|

Updated on: Jan 24, 2021 | 10:53 PM

Share

NCC Cadets ‘vocal for local’ programe :   దేశాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయగలిగినా.. చేస్తూనే ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ. స్వయం సమృద్ధ భారత దేశం’ సాకారమవడం యువతపైనే ఆధారపడి ఉందని చెప్పారు. ఢిల్లీలో ఎన్‌సీసీ క్యాడెట్ల రిపబ్లిక్‌ డే రిహార్సల్స్‌ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు ప్రధాని మోదీ. ఎన్‌సీసీ క్యాడెట్ల అద్భుతమైన విన్యాసాలను మోదీ తిలకించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా హాజరయ్యారు.

వోకల్‌ ఫర్‌ లోకల్‌ .. నినాదాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు మోదీ. ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌ మన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సీసీ క్యాడెట్లతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు. రిపబ్లిక్‌డే నాడు పాల్గొనే కళాకారులు హాజరయ్యారు. భారత సామాజిక సాంస్కృతిక వైభవానికి రిపబ్లిక్‌ డే పరేడ్‌ అద్దం పడుతుందని అన్నారు మోదీ. దేశంలో రాజ్యాంగమే సుప్రీం అన్న భావనను కలిగిస్తుందన్నారు. యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్దిని సాధిస్తుందని అన్నారు మోదీ. ఎవరో చెప్పిన మాటలు వినకుండా యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై దేశ ప్రజలకు సరైన సమాచారం అందివ్వడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లపై పుకార్లను తిప్పికొట్టేందుకు యువత నడుంబిగించాలని కోరారు. గ్రామగ్రామన యువత వ్యాక్సిన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పేదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కళతో ప్రధాని మోదీని , కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ , కిరణ్‌రిజీజ్‌ను ఆకట్టుకున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు మోదీ. తప్పకుండా కరోనాపై పోరులో భారత్‌ ప్రపంచదేశాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు.

కాగా, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు ప్రధాని. దేశ ప్రతిష్టను ఇనుమడించే రీతిలో యువత తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. యువతకు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మార్పు కోసం పనిచేస్తేనే అభివృద్ది సాధ్యమన్నారు.