రాష్ట్రాలకు ఆ అధికారం లేదు.. “సీఏఏ”పై కేంద్రం మంత్రి మరోసారి క్లారిటీ

పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదన్నారు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ అన్న దానిపై ప్రజల్లో ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఓ వర్గం వారిని రెచ్చగొడుతూ.. పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ) అనేది ఇక్కడుంటున్న భారతదేశ పౌరులకు ఉద్దేశించింది కాదనిద స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ప్రభుత్వం లాక్కోదన్నారు. కొందరు స్వప్రయోజనాల కోసం చట్టంపై తప్పుడు ప్రచారం […]

రాష్ట్రాలకు ఆ అధికారం లేదు.. సీఏఏపై కేంద్రం మంత్రి మరోసారి క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2020 | 4:39 AM

పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదన్నారు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ అన్న దానిపై ప్రజల్లో ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఓ వర్గం వారిని రెచ్చగొడుతూ.. పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ) అనేది ఇక్కడుంటున్న భారతదేశ పౌరులకు ఉద్దేశించింది కాదనిద స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ప్రభుత్వం లాక్కోదన్నారు. కొందరు స్వప్రయోజనాల కోసం చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మంగళవారం రోజు కేరళ అసెంబ్లీలో.. రాష్ట్రంలో సీఏఏను అమలు చేసేదిలేదంటూ తీర్మానం ఆమోదించడంపై కూడా స్పందించారు. పౌరసత్వానికి సంబంధించి చట్టం చేసే అధికారం కానీ, తీర్మానం ఆమోదించే అధికారం కానీ కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందన్నారు. అసెంబ్లీలకు ఎంతమాత్రం అధికారం లేదన్నారు. కేరళ సీఎం.. దీనిపై న్యాయసలహా తీసుకుంటే పూర్తి విషయం తెలుస్తుందన్నారు.

కాగా, సీఏఏను రాష్ట్రంలో అమలు చేయమంటూ కేరళ సీఎం పినరయి విజయన్ మంగళవారం అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అధికార సీపీఎం-ఎల్‌డీఎఫ్, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఫ్ మద్దతిచ్చాయి. ఇక ఒకేఒక్క సభ్యుడు ఉన్న బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. అనంతరం ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!