AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir: అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా..

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే రాములోరి విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు.

Ram Mandir: అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా..
Ayodhya Ram Mandir Set Up In Chandigarh
Srikar T
|

Updated on: Jan 21, 2024 | 10:12 AM

Share

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే రాములోరి విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రలు అవుతున్నారు. ఈ ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శ్రీ రామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుతం దర్శననిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ సభ్యుడు వెల్లడించారు.

500ఏళ్ల నాటి చరిత్ర సాకారం అవుతుందన్నారు శ్రీరామ్ కృపా సేవా ట్రస్ట్ సభ్యులు ప్రదీప్ బన్సాల్. ఈ కార్యక్రమంలో మేయర్ అనూప్ గుప్తా తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ అద్భుతమైన ఘట్టానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రకరకాల విద్యుత్ కాంతులు, రంగురంగుల బాణాసంచాల నడుమ అంగరంగ వైభవంగా ఈవేడుకను నిర్వహిస్తామంటున్నారు. దశాబ్దాల నాటి ఉద్యమానికి నేడు ఫలితం దక్కనుందన్నారు. అందుకే లక్షలాది మంది అపారమైన భక్తివిశ్వాసాలతో ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు. కేవలం అయోధ్యలోనే కాకుండా చండీగఢ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో అన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

అయోధ్య లైవ్ వీడియో:

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..