AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరాకిల్.. మహిళ నుంచి పురుషుడిగా మారి తండ్రి అయిన పోలీస్ కానిస్టేబుల్‌..

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు పురుషుడిగా మారిన తర్వాత.. ఈ నెల 15న మగబిడ్డకు తండ్రి అయ్యారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ లలితా సాల్వే 2018లో లింగ మార్పిడి శాస్త్ర చికిత్స చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. పండంటి మగబిడ్డకు తండ్రి అయ్యారు. వివరాల ప్రకారం.. బిడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలిత్ కుమార్ సాల్వే 1988లో పుట్టారు.

మిరాకిల్.. మహిళ నుంచి పురుషుడిగా మారి తండ్రి అయిన పోలీస్ కానిస్టేబుల్‌..
Lalita Salve
Shaik Madar Saheb
|

Updated on: Jan 21, 2024 | 8:57 AM

Share

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు పురుషుడిగా మారిన తర్వాత.. ఈ నెల 15న మగబిడ్డకు తండ్రి అయ్యారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ లలితా సాల్వే 2018లో లింగ మార్పిడి శాస్త్ర చికిత్స చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. పండంటి మగబిడ్డకు తండ్రి అయ్యారు. వివరాల ప్రకారం.. బిడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలిత్ కుమార్ సాల్వే 1988లో పుట్టారు. 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే, 2013లో శరీరంలో వస్తున్న మార్పులను గమనించి లలితా సాల్వే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమెలో పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పురుషులు X, Y సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటే, స్త్రీలు రెండు X క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. అప్పుడు సాల్వేకు జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగమార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.

2018లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత కానిస్టేబుల్ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పట్లో సాల్వే వార్తల్లో నిలిచారు. అనుమతి అనంతరం సాల్వే.. 2018 నుంచి 2020 మధ్య మూడు సర్జరీలు చేయించుకోవలసి వచ్చింది.

పూర్తిగా లింగమార్పిడి అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ఓ మహిళతో సాల్వే వివాహం జరిగింది. అనంతరం జనవరి 15న బిడ్డ తండ్రి అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లలిత్ సాల్వే.. మహిళ నుంచి పురుషునిగా తన ప్రయాణం పోరాటాలతో నిండి ఉందన్నారు. ఈ సమయంలో, తనకు మద్దతుగా నిలిచిన చాలా మంది నుంచి ఆశీస్సులు పొందానని.. తన భార్య సీమ ఒక బిడ్డను కలిగి ఉండాలని కోరుకుంటుంది.. ఇప్పుడు తండ్రిని అయినందుకు సంతోషంగా ఉంది.. నా కుటుంబం మొత్తం థ్రిల్‌గా ఉంది.. అంటూ సాల్వే పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు