AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రామసేతును సందర్శించిన మోదీ.. ధనుష్కోడిలో గౌరవ వందన సమర్పణ..

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్యతీర్థాలను సందర్శిస్తున్నారు. ఆదివారం తన పర్యటనలో భాగంగా ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్‎ను సందర్శించారు. అక్కడి స్థూపానికి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. అలాగే రామ సేతును తీరంలో కూర్చొని ప్రాణాయామం చేశారు. శనివారం శ్రీరంగంలోని రంగనాథుణ్ణి దర్శించుకున్న మోదీ రామాయణం గొప్పతనాన్ని స్మరించుకున్నారు.

PM Modi: రామసేతును సందర్శించిన మోదీ.. ధనుష్కోడిలో గౌరవ వందన సమర్పణ..
Pm Modi
Srikar T
|

Updated on: Jan 21, 2024 | 11:39 AM

Share

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్యతీర్థాలను సందర్శిస్తున్నారు. ఆదివారం తన పర్యటనలో భాగంగా ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్‎ను సందర్శించారు. అక్కడి స్థూపానికి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. అలాగే రామ సేతును తీరంలో కూర్చొని ప్రాణాయామం చేశారు. అనంతరం కోదండ రాముడిని దర్శించుకున్నారు. శనివారం శ్రీరంగంలోని రంగనాథుణ్ణి దర్శించుకున్న మోదీ రామాయణం గొప్పతనాన్ని స్మరించుకున్నారు. తదనంతరం రామేశ్వరాన్ని సందర్శించారు. ఆలయంలోని అనేక పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. రామేశ్వరంలో సాగర స్నానం చేసి శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగానికి ప్రత్యేక పూజలు చేశారు.

అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కఠిన ఉపవాస దీక్షను చేపట్టారు మోదీ. ప్రతి రోజు సాత్విక ఆహారంగా కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే సేవిస్తున్నారు. కటిక నేలపై నిద్రింస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంతో శ్రీరామునికి ఎనలేని సంబంధం ఉన్నందున ఈ పదకొండు రోజులపాటు ఒక్కో పుణ్యస్థలాన్ని సందర్శించనున్నారు. నేటితో పర్యటన ముగించుకుని రేపు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు.

మోదీ కోదండరాముడిని దర్శించిన వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..