ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటు;లోకి వస్తుందని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్ .కె. అరోరా తెలిపారు. ఇది ఉచితంగా లభిస్తుందన్నారు. దీంతో ప్రస్తుతం ఇస్తున్న కోవీషీల్డ్, కొవాగ్జిన్ టీకామందులతో బాటు ఇది కూడా ఫ్రీగా ఇస్తున్న మూడో వ్యాక్సిన్ అవుతుందని ఆయన చెప్పారు. దీన్ని మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుందని.. పోలియో వ్యాక్సిన్ తో బాటే ఈ టీకామందును సైతం ఈ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చునని ఆయన చెప్పారు. ప్రస్తుతం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రైవేటు రంగంలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఈ కారణం చేతనే తమ ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశం ఉందని అరోరా చెప్పారు. దేశంలో ప్రస్తుతం పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు.. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో కోవిద్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం తగినట్టు కనిపిస్తోందన్నారు.రానున్న రోజుల్లో మోడెర్నా, జైడస్ క్యాడిలా టీకామందులు కూడా ఇండియాలోకి ఎంటర్ కానున్నాయని.. దాంతో అసలు టీకామందుల కొరత అంటూ ఉండదని అయన పేర్కొన్నారు.
ఈ ఏడాది అంతానికల్లా 18 ఏళ్ళు పైబడిన 93 కోట్ల మందికి వ్యాక్సీన్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా ఉందని అరోరా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నారని.. కానీ దానిపై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం ఉంటుందా ఉండదా అన్నది ఇప్పుడే చెప్పలేమని అరోరా అన్నారు. ఏది ఏమైనా థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం ఈ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి :మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.