రైతు బిల్లులను అడ్డుకోండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సోనియా సూచన

కేంద్రం తెచ్చిన రైతు బిల్లులను పట్టించుకోకుండా వాటిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పాలిత రాష్టాలు కొత్తగా చట్టాలు తీసుకువచ్ఛే అంశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. ఇది అసలు రాష్ట్రాలకు..

  • Umakanth Rao
  • Publish Date - 8:48 pm, Mon, 28 September 20
రైతు బిల్లులను అడ్డుకోండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సోనియా సూచన

కేంద్రం తెచ్చిన రైతు బిల్లులను పట్టించుకోకుండా వాటిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పాలిత రాష్టాలు కొత్తగా చట్టాలు తీసుకువచ్ఛే అంశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. ఇది అసలు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని ఆమె అన్నారు. రాజ్యాంగంలోని 254 (2) అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభలు ఈ విధమైన చట్టాలను తేవచ్చునని ఆమె పేర్కొన్నారు. అటు-పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ రైతులకు సంఘీభావం తెలుపుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్నదాతలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందాక ఇవి చట్టాలుగా మారినప్పటికే మన పోరాటం ఆగరాదన్నారు.