రక్షణరంగ పరికరాల కొనుగోళ్లకు కొత్త విధానం

దేశ రక్షణకు కేంద్రం పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది.

రక్షణరంగ పరికరాల కొనుగోళ్లకు కొత్త విధానం
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2020 | 8:38 PM

దేశ రక్షణకు కేంద్రం పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇటీవలే రఫెల్ యుద్ధ విమానాలతో భారత ఆర్మీ బలోపేతం కాగా, తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర సర్కార్. దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. సోమవారం జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేన చీఫ్‌ బదౌరియా, నావికాదళాధిపతి కరమ్‌బీర్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలు ఆయుధాల కొనుగోలు విధానాలను మరింత సులభతరం చేశారు. భారత్‌ చైనా సరిహద్దు ప్రాంతం ఎల్‌ఏసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. వచ్చే ఐదేళ్లలో 130 బిలియన్‌ డాలర్లు విలువైన క్యాపిటల్‌ ప్రొక్యూర్మెంట్‌ ఆయుధ కొనుగోళ్లు జరగవచ్చని ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సంపత్తిని సమకూర్చి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది.