మరోసారి దిగివచ్చిన బంగారం ధరలు
దేశంలో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ సమయంలో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ సమయంలో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధర రూ.194 తగ్గి రూ.50,449కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో దేశంలో బంగారం ధర తగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు తెలిపారు. కాగా, గత ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,643 వద్ద ముగిసింది.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.933 తగ్గి రూ.59,274కు చేరింది. గత ట్రేడ్‌లో వెండి 60,207 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధలను ఒకసారి పరిశీలిస్తే.. ఔన్స్ బంగారం ధర 1,857 డాలర్లకు దిగివచ్చింది. ఔన్స్ వెండి ధర కూడా 22.70 డాలర్లకు చేరింది.